చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించి మెప్పించిన అలనాటి నటి బేబీ వరలక్ష్మి. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నటిగా కొనసాగారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఉన్నట్లు ఆమె వెల్లడించారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. చెల్లి పాత్రల్లో ఎక్కువ సినిమాలు చేసి.. ఆరోజుల్లో హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికం అందుకున్నారని.. బేబీ వరలక్ష్మికి వేల కోట్లు ఆస్తులు ఉన్నాయా? ఆమెను అడగ్గా.. ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇక తన జీవితంలో ఎదుర్కున్న అవమానాలపై కూడా ఆమె స్పందించారు.
సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయంతో బేబీ వరలక్ష్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి.. హీరోలకు చెల్లెలి పాత్రలు చేసే స్థాయికి ఎదిగారు. అయితే అప్పట్లో దాదాపు ప్రతీ సినిమాలో రేప్ సీన్స్ ఉండేవి. హీరో చెల్లెలిని విలన్లు అత్యాచారం చేసే సన్నివేశాలు ఉండేవి. ఆ చెల్లెలి పాత్రల్లో నటించిన వారిలో బేబీ వరలక్ష్మి ఒకరు. అయితే ఈ రేప్ సీన్స్ లో నటించిన కారణంగా తాను అనేక అవమానాలకు గురయ్యానని తెలిపారు. చెల్లెలి పాత్రలు, రేప్ సీన్స్ లో అత్యాచారానికి గురయ్యే అమ్మాయి పాత్రల్లో ఎక్కువగా నటించారు వరలక్ష్మి. అయితే చెల్లెలి పాత్రలు కంటే ఎక్కువగా ఆమె రేప్ కి గురైన పాత్రలనే జనం ఎక్కువగా గుర్తుంచుకున్నారని ఆమె అన్నారు.
నిజ జీవితంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే తన మీద సానుభూతి చూపిస్తారు. కానీ రేప్ కి గురైన పాత్రలో నటిస్తే తనను ఎందుకు అవమానించేవారో అర్థమయ్యేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేప్ సీన్స్ లో నటించినప్పుడు కూడా తాను ఇంత బాధపడలేదని.. కానీ తనను రేప్ వరలక్ష్మి, రేపుల వరలక్ష్మి అంటుంటే మాత్రం చాలా బాధపడేదాన్నని ఆమె వెల్లడించారు. అలా పిలవకండి అంటూ ఆమె అనేవారట. తనను సిస్టర్ వరలక్ష్మి అని గానీ, చెల్లెలు గానీ బేబీ వరలక్ష్మి అని పిలిస్తే సంతోషిస్తానని అన్నారు. చాలా మంది తోటి సహనటులు తనను రేపుల వరలక్ష్మి అంటూ పిలిచేవారని గుర్తు చేశారు. ఒకసారి ఓ సినిమా 100 రోజుల ఫంక్షన్ లో.. ‘రేపుల వరలక్ష్మి’ అంటూ మైక్ లో అరుస్తూ పిలిచారని.. ఆరోజు చాలా బాధపడ్డానని అన్నారు.
తనను అలా పిలిస్తే కోపం వచ్చేదని అన్నారు. ఒక అమ్మాయిని రేప్ చేయడమే తప్పు.. అలాంటిది రేపుల వరలక్ష్మి అనడం ఇంకా పెద్ద తప్పు అని, ఆ పదాన్నే వాడకూడదని ఆమె అన్నారు. అయితే తనను ఎవరైతే తనను బాధపెట్టారో వాళ్ళందరూ కర్మ అనుభవిస్తున్నారని, కష్టపడుతున్నారని అన్నారు. అలా అని వాళ్ళనేమీ తాను శపించలేదని.. ఒక ఆర్టిస్ట్ ని అలా కించపరచడం కరెక్ట్ కాదని అన్నారు. మరి బేబీ వరలక్ష్మిని కించపరిచే విధంగా మాట్లాడడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే ఆమె రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారు. ఈ తరం హీరోలకు తల్లి పాత్రల్లో నటించాలని తన అభిలాషను బయటపెట్టారు. ఆమె కోరిక నెరవేరాలని కోరుకుందాం.