ఇండస్ట్రీలో ఒకానొక దశలో వరుస సినిమాలతో అలరించిన ఎంతోమంది నటులు, నటీమణులు.. కొన్నాళ్ల తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతారు. స్టార్ హీరోయిన్లుగా చెలామణి అయిన వాళ్ళు కూడా కొన్నేళ్ల తర్వాత కనిపించడమే మానేశారు. కొన్ని మీడియా ఛానల్స్ పుణ్యమా అని వాళ్ళని వెతికి మరీ వారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారిని అప్పటి తరం ప్రేక్షకులకు గుర్తు చేస్తూ.. ఈతరం ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో 1973లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి సీనియర్ హీరోలకు చెల్లెలిగా నటిస్తూ.. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన బేబీ వరలక్ష్మిని సుమన్ టీవీ రోషన్ ఇంటర్వ్యూ చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా ఆమె జీవితంలో ఎదురైన అనుభవాలను సుమన్ టీవీతో పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బేబీ వరలక్ష్మి గురించి ఈ జనరేషన్ కి తెలియకపోవచ్చు. ముక్కు కింద మచ్చ ఉండే ఈ నటి.. ఏఎన్నార్, కృష్ణ వంటి సీనియర్ హీరోల సినిమాల్లో నటించారు. ఎక్కువగా హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత చెల్లెలి పాత్రలకు పరిమితమయ్యారు. అయితే తెలుగులో చెల్లెలి పాత్రల్లో నటించిన బేబీ వరలక్ష్మి.. కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. తెలుగు ప్రేక్షకులు ఆమెను హీరోలకు చెల్లెలిగానే స్వీకరించడంతో హీరోయిన్ గా చేసే అవకాశం రాలేదు.
ఇక ఈమె తన జీవితంలో ఎదురైన అనుభవాలను చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు ఏడ్చేశానని ఆమె వెల్లడించారు. సిస్టర్ వరలక్ష్మి అనో లేక బేబీ వరలక్ష్మి అని పిలిస్తే పలుకుతాను గానీ.. రేపుల వరలక్ష్మి అని పిలిస్తే చాలా బాధపడేదాన్నని అన్నారు. కొంతమంది సహ నటులు తనను రేపుల వరలక్ష్మి అంటూ పిలిచేవారని గుర్తు చేశారు. అది తనకు ఏ మాత్రం నచ్చేది కాదని అన్నారు. ఇక ఆమె ఆస్తుల గురించి కూడా బయటపెట్టారు. ‘హీరోయిన్ కి ధీటుగా సినిమాలు చేసిన వరలక్ష్మి.. పారితోషికంలో కూడా హీరోయిన్ రేంజ్ లోనే తీసుకున్నారని.. చెన్నైలో కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని అనుకుంటారు’ అన్న ప్రశ్నను ఆమె ముందు ఉంచగా.. బేబీ వరలక్ష్మి భిన్నంగా స్పందించారు.
అదంతా నిజం కాదని.. పబ్లిక్ ని ఫూల్స్ ని చేయకూడదని అన్నారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ లకి చాలా తక్కువ పారితోషికాలు ఉండేవని.. చైల్డ్ ఆర్టిస్టుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్నది షాలిని అని అన్నారు. ఆ పారితోషికాలు స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేవి కాదని, తమ తండ్రి స్కూల్ ఫీజులు కట్టడానికి ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. ఎప్పుడైతే చెల్లెలి పాత్రలు చేయడం మొదలుపెట్టాక మంచి పారితోషికం అందుకున్నానని అన్నారు. అయితే నటిగా కొనసాగలేదు కానీ అప్పుడు వచ్చిన పారితోషికాలతో కొంత ఆస్తిని కూడబెట్టుకున్నానని, అది ఉండబట్టి సరిపోయిందని.. తనకేమీ కోట్ల ఆస్తులు లేవని, మినిమమ్ ఆస్తులు సంపాదించుకుని సంతోషంగా ఉంటున్నానని అన్నారు.
ఇక మళ్ళీ యాక్టింగ్ చేస్తారా అని అడిగితే.. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలకి తల్లిగా నటించాలని ఉందని అన్నారు. అవకాశం ఇస్తే నటిస్తా అని.. తెలుగు దర్శకులు అవకాశాలు ఇవ్వాలని ఆమె సుమన్ టీవీ ఛానల్ ద్వారా రిక్వస్ట్ చేశారు. మన దర్శకులు ఆమెకు అవకాశం ఇవ్వాలని ఆశిద్దాం. మరి ఒకప్పుడు చెల్లెలి పాత్రల్లో అలరించిన వరలక్ష్మి ఈరోజు ఇలా మీ ముందుకు రావడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.