టాలీవుడ్ లో టాప్ లెవెల్ల్లో వెలిగిన హీరోయిన్ ఆసిన్. తమిళ్ లో గజనీ మూవీతో స్టార్‌గా మారింది. బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత 2016లో బిజినెస్ మాన్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. ఈ మధ్యకాలంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో వారు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ఎంత త్వరగా చేసుకుంటున్నారో.. అంతే స్పీడ్‌గా విడాకులు కూడా తీసుకుంటున్నారు. చిన్నచిన్న విషయాలకే మనస్పర్థలు రావడం, విడిపోవడం ఫ్యాషనైపోయింది. యువకులు తమ జీవితాలను తామే అగమ్యగోచరంగా చేసుకుంటున్నారు. భార్యాభర్తలు కలిసి ఉండేవారు చాలా తక్కువ. విలువలు లేని కాపురాలు ఎక్కువకాలం నిలబడవు. భార్యాభర్తల బంధాన్ని మూన్నాళ్ల ముచ్చటగానే చేస్తున్నారు. ప్రతి కాపురంలో కలహాలు సహజం. పరిష్కారాలకు తావు ఇవ్వక విచ్చల విడిగా నిర్ణయాలు తీసుకుని.. వైవాహిక బంధాన్ని హేళన చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో అయితే చెప్పక్కర్లేదు. సినీ తారలు పెళ్లిళ్లు చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పి చాలా మంది సెటిల్ అయ్యారు. అందులో కొందరు చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అలాగే ఆసిన్ పై కూడా విడాకులు తీసుకుంటుందన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆసిన్ పూర్తి పేరు ఆసిన్ తొట్టుంకల్. ఈమె తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ సక్సెస్ పుల్ హీరోయిన్స్ లలో ఆసిన్ ఒకరు. తెలుగులో మొదటగా ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలో నటించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో.. మాస్ మహారాజ్ రవితేజతో నటించిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలు వరుసగా హిట్ కొట్టాయి. అంతేకాదు ఆమె కెరియర్‌కు బాగా తోడ్పడ్డాయి. ఆ తర్వాత నాగార్జునతో శివమణి, బాలకృష్ణతో లక్ష్మీనరసింహ, వెంకటేష్‌తో ఘర్షణ, సినిమాలు వరుసగా సక్సెస్ అందుకున్నాయి. పవన్ కల్యాణ్ తో నటించిన అన్నవరం, ప్రభాస్ తో నటించిన చక్రం సినిమాలు పెద్దగా ఊపందుకోలేదు.
టాలీవుడ్ లో టాప్ లెవెల్ల్లో వెలిగిన హీరోయిన్ ఆసిన్. తమిళ్ లో గజనీ మూవీతో స్టార్‌గా మారింది. బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత 2016లో బిజినెస్ మాన్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. సినిమాలకు దూరంగా ఉంటూ.. తన వైవాహిక జీవితాన్ని హాయిగా గడిపింది. వీరిద్దరికి ఒక పాప జన్మించింది. ఆసిన్ భర్త రాహుల్ మైక్రోమాక్స్ కంపెనీకి సీఈవోగా పనిచేశాడు. అయితే వీరు ఇరువురు భార్యభర్తలు చాలాకాలంపాటు అన్యోన్యంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో వారు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. రాహుల్ శర్మ గత కొద్దిరోజులుగా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలిసిన ఆసిన్..రాహుల్ శర్మను హెచ్చరించిందట. అయినా తన మాటవినకుండా రాహుల్ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండడంతో అతని నుండి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. పాప ఉన్నా కూడా ఆసిన్ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యిందని వదంతులు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతుండగా.. ఆసిన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.