ట్రోల్స్, ఇతర విషయాలను పట్టించుకోకుండా ఇటీవల కాలంలో నటీనటులు తమకు నచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. న్ననాటి నుండి సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు, ఫ్యామిలీ ఫోటోలు పంచుకుంటారు. ముఖ్యంగా నటీమణులు.. ఫోటో షూట్లు, ఫారిన్ ట్రిప్పులు, కుటుంబ సభ్యుల ఫోటోలు పంచుకుంటున్నారు
ప్రస్తుతం మన చిత్రాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. పరిధి మించి పోతుంది. హాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్‌లో నటిస్తున్నారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం బాలీవుడ్ నుండి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలను ఏదో విధంగా వంచించి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రేమ పేరుతో, అదనపు కట్నం కోసమని వేధింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది సినిమాల్లో నటించే అవకాశాలు కల్పిస్తామని నమ్మించి యువతుల పట్ల అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. ఇదే విధంగా ఓ నటుడు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులలో విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
తెలుగు సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన రాజ్-కోటి ద్వయంలో ఒకరైన సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరన్న వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. అంతలోనే శరత్ బాబు చనిపోయారంటూ పిడుగులాంటి వార్త. తెలుగు, తమిళ పరిశ్రమలోని ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలీవుడ్‌లో కూడా ఇవే వార్తలు. యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్, మరో నటుడు నితేష్ పాండే తుది శ్వాస విడిచారు. తాజాగా ప్రముఖ షింగర్ ఇక లేరన్న వార్త వినిపించింది.
హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ అతి త్వరలో ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు..
ప్రస్తుతం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. దీనికి కారణం అధిక ధరలు. టికెట్ రేట్ల కంటే పాప్ కార్న్, సాఫ్ట్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సినిమా చూస్తే తాము రివర్స్‌లో డబ్బులు ఇస్తామంటూ ఒక వెబ్ సైట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
శరీరాకృతి, అందం కోసం నటీ నటులు పలు అవయవాలకు ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. మేకోవర్ కోసం బాలీవుడ్ నుండి మాలీవుడ్ హీరో హరోయిన్లు అనేక మంది సర్జరీలు చేయించుకున్నవారే. కానీ ఇవి కొన్నిసార్లు వికటించి.. ప్రాణం మీదకు తెచ్చిన ఘటనలు ఎన్నో. తాజాగా మరో మోడల్ తుది శ్వాస విడిచారు.
ఆస్కార్ గెలుచుకున్న వారికి వెలకట్టలేని అవార్డు దక్కింది. మరి ఆస్కార్ నామినీస్ గా వెళ్లిన వారికి ఏం ఉంటుంది? అది కాదు సార్.. కష్టపడి ఆస్కార్ నామినేషన్స్ వరకూ వచ్చాం మాకేంటి.. అహ మాకేంటి అని అడిగే నామినీ బ్యాచ్ కి అదిరిపోయే బహుమతులు ఇచ్చారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన సినిమాగా ‘అవతార్ 2’ను చెప్పొచ్చు. గతేడాది ఆఖర్లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌ను డిజిటల్ స్క్రీన్లపై ఎప్పటినుంచి చూడొచ్చంటే..!