టాప్ స్టార్స్‌తో పనిచేయాలని ప్రతి ప్రొడ్యూసర్ అనుకుంటారు. కానీ.., అందరికీ అది సాధ్యం కాదు. అయితే టాలీవుడ్‌లో నిర్మాత అశ్వనీదత్ కి అది సాధ్యమైంది.సీనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో పరిశ్రమకు వచ్చిన ఆయన.. నిర్మాతగా దాదాపుగా అందరు స్టార్ హీరోలను కవర్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. అలాంటి అశ్వనీదత్‌కు ఇప్పటికీ ఓ కోరిక మిగిలిపోయిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నది అశ్వనీదత్ కోరిక అట. ఆల్ రెడీ ఎన్టీఆర్‌తోమూడు సినిమాలు చేసినా.. ఆయన కోరుకున్న హిట్ మాత్రం కొట్టలేదని అనుకుంటున్నాడట అశ్వనీదత్. దీంతో ఇప్పుడు దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాల్లో పడ్డాడని తెలుస్తోంది.
అశ్వనీదత్‌కు ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. అందుకే ఎన్టీఆర్ రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ మూవీని నిర్మించాడు. ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఎన్టీయార్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అటుపై మళ్లీ అశ్వనీదత్‌తో సినిమా చేయడానికి చాలా సమయం పట్టింది. అలా మళ్లీ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో కంత్రి, శక్తి మూవీలు చేయగా.. అవి పెద్దగా ఆడలేదు. దీంతో ఎన్టీఆర్‌కు మరో భారీ హిట్ ఇవ్వాలనుకున్న అశ్వనీదత్ కల కలగానే మిగిలిపోయింది. దీంతో తన కల టాలీవుడ్ డైరెక్టర్లతో తీరేలా లేదని.., ఇప్పుడు కోలివుడ్ నుంచి స్టార్ డైరెక్టర్‌ను తీసుకొస్తున్నాడట అశ్వనీదత్.
ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి తమిళ్ టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నఅట్లీకి అడ్వాన్స్ ఇచ్చాడ అశ్వనీదత్. కానీ.., ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చేస్తుండగా.., ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుంది. అంటే 2022 వరకు అశ్వనీదత్ ఆగాల్సి ఉంటుది. అటు అట్లీ కూడా బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. అతడు ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి కూడా దాదాపు అంతే టైమ్ పడుతుంది. అంటే అన్నీ అనుకున్నట్లు కుదిరితే.. 2022లో అశ్వనీదత్ బ్యానర్‌లో ఎన్టీఆర్ – అట్లీ కాంబోలో సినిమా ఉంటుంది. మరి ఈ మూవీతో అశ్వనీదత్ ఎన్టీఆర్‌కు హిట్ ఇవ్వాలనే కోరిక నెరవేరుతుందేమో చూడాలి.