‘ది లెజెండ్’.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరు మారుమ్రోగుతోంది. ది లెజెండ్ శరవణ స్టోర్ట్ అధినేత అరుళ్ శరవణన్ ‘ది లెజెండ్’ అనే సినిమా నిర్మించి.. హీరోగా పరిచయం అయ్యారు. ఆయన సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ నుంచి అంతా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు.. ఎవరు చూస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సినిమాతో అరుళ్ శరవణన్ కి నష్టం కాదు.. కోట్లలో లాభం వచ్చింది అంటున్నారు. మరి అదెలాగో తెలుసుకుందాం…
ది లెజెండ్ సినిమా విడుదలై బిలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో అరుళ్ శరవణన్ కు రూ.80 కోట్లు నష్టం వచ్చినట్లే అంటున్నారు. అంత బడ్జెట్‌తో సినిమా అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. డబ్బులు ఎక్కువై సినిమా తీశారంటూ కొందరు కాస్త గట్టిగానే విమర్శిస్తున్నారు. అయితే అందరూ ముందు తెలుసుకోవాల్సింది.. అరుళ్ శరవణన్ యాక్టర్ అయ్యాక వ్యాపార వేత్త కాలేదు. వ్యాపారంలో సక్సెస్ అయ్యాకే యాక్టర్ అయ్యాడు.
ఒక బిజినెస్ మ్యాన్ ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాడంటే దాని నుంచి కనీసం పావలా అయినా లాభం ఆశిస్తాడు. అలా కుదరని పరిస్థితిలో అసలు ఆ పని మొదలు పెట్టడు. మరి.. రూ.80 కోట్లు బడ్జెట్ తో సినిమా అంటే అరుళ్ శరవణన్ ఎంత ఆలోచించి ఉంటారు? అంత గుడ్డిగా సినిమా తీశేయరు కదా? అవును అదే కరెక్ట్.. అంత ఈజీగా సినిమా తీయలేదు. ఈ ఆలోచన వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్ ఉందంటున్నారు.
అరుళ్ శరవణన్ స్టోర్స్ లో దుస్తులు, బంగారం అమ్ముతుంటారు. దీపావళి, సంక్రాంతిలాంటి పండుగలకు భారీ మొత్తంలో ఖర్చుపెట్టి కమర్షియల్స్ చేసేవారు. అరుళ్ శరవణన్ ఆ యాడ్స్ లో స్వయంగా నటించేవారు. కానీ, ఆయన అంత పాపులర్ కాదు కాబట్టి పక్కన కచ్చితంగా ఒకరిద్దరు సెలబ్రిటీలు ఉండాల్సిందే. ఒక్కోసారి ఐదుగురు కూడా ఉండచ్చు. వాళ్లందరికీ బాగానే రెమ్యూనరేషన్ ఇచ్చేవారు.
అతి త్వరలోనే ది లెంజడ్ శరవణ స్టోర్స్ ను ఇండియా మొత్తం ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అంటే అప్పుడు కమర్షియల్స్ కాస్ట్ కూడా కచ్చితంగా పెరుగుతుంది. అంతేకాకుండా అతనెవరబ్బా అంటూ తికమక పడే అవకాశం కూడా ఉంది. పాన్ ఇండియా లెవల్లో వ్యాపారానికి ముందే పాన్ ఇండియా సినిమాతో దేశమొత్తం ఫోకస్ తనవైపు తిప్పుకున్నారు. ఇక నుంచి కమర్షియల్స్ లో పక్కన ఎలాంటి సెలబ్రిటీలు కూడా అవసరం లేదు.
ది లెజెండ్ సినిమాకి వచ్చిన బజ్, జరిగిన చర్చతో అరుళ్ శరవణన్ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సాధించారు. అంతేకాకుండా ఒకటి రెండు సినిమాలు తీస్తే ఆయన్ని కూడా హీరోదా యాక్సెప్ట్ చేస్తారంటూ కొందరు పాజిటివ్ గా కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఈ సింపుల్ లాజిక్ తో అరుళ్ శరవణన్‌కు సినిమా ద్వారా పెట్టిన రూ.80 కోట్లు లాస్ అయినా కూడా వ్యాపారం ద్వారా కోట్లలో లాభం వచ్చినట్లే. అరుళ్ శరవణన్ గొప్ప వ్యాపారవేత్త అని మరోసారి నిరూపించుకున్నారు. అరుళ్ శరవణన్ సినిమా ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.