ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేస్తూ సంపాదించే ఆదాయం ఖర్చులకు మాత్రమే సరిపోతుంది. దాంతో చాలా మంది వ్యాపారం వైపు అందునా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవకు చెందినదే చందనం చెట్ల పెంపకం. ఆ వివరాలు..
ప్రస్తుత కాలంలో ఓ కుటుంబం కనీస సౌకర్యాలు సమకూర్చుకోవాలంటే.. భార్యాభర్తలిద్దరు పని చేయాల్సిందే. అలా ఇద్దరు సంపాదించినా సరే.. అప్పుడప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి. సేవింగ్స్ మాట దేవుడెరుగు.. ఖర్చులకు సరిపడా డబ్బులుంటే చాలు అన్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు. అందుకే చాలా మంది ఉద్యోగాలు చేస్తూనే.. ధైర్యం చేసి.. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములు ఉన్న వారు పండ్లతోటల పెంపకం వంటివి చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం కాలాంలో చాలా మంది యువత ఉరుకులపరుగులు ఉద్యోగాలు వద్దు.. ప్రశాంతంగా ఉండే వ్యవసాయమే ముద్దు అనుకుంటూ.. ఆ రంగంలోకి అడుగులు వేసి భారీగా సంపాదిస్తున్నారు. మరీ మీరు కూడా ఇలాంటి ఆలోచనలో ఉంటే.. చందనం చెట్ల పెంపెకం వల్ల భారీగా లాభాలు ఆర్జించవచ్చు అంటున్నారు. ఇది దీర్ఘకాలంలో భారీ లాభాలు ఇస్తాయని అంటున్నారు నిపుణులు. ఆ విరాలు..
ఎర్రచందనం.. కలప జాతి మొక్కల్లో ఎంతో విలువైనది. సామాన్యులు ముద్దుగా ఎర్ర బంగారం అని పిలుచుకుంటారు. మన దేశంలో కన్నా విదేశాల్లో దీనికి డిమాండ్ ఎక్కువ. మరీ ముఖ్యంగా రష్యా, చైనా, జపాన్ దేశాల్లో వంట పాత్రలు కూడా దీని నుంచి తయారు చేసినవే వాడతారు. సౌందర్య సాధనాల తయారీలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. అలానే అనేక రకాల ఔషధాల తయారీ కోసం కూడా వినియోగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్న ఎర్రచందనం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ శేషాచలం అటవీ ప్రాంతంలో పెరుగుతుంది. అక్కడి ఎర్ర నేలలు వీటి పెరుగుదలకు సహజసిద్ధంగా కలిసి వస్తున్నాయి. అయితే దీనికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య కాలంలో కొందరు రైతులు.. పండ్ల తోటల మాదిరి ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. దాంతో ప్రసుత్తం ఎర్రచందనం సాగుకు డిమాండ్ భారీగా పెరిగింది. 15-20 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తాయి.
సాధారణంగా ఎర్రచందనం మొక్క 1000-1500 రూపాయలు ఉంటుంది. కానీ రైతులకు కేవలం 100-150 రూపాయలకు అందిస్తోంది ప్రభుత్వాలు. ఇక ఎకరాకు 600 మొక్కలు నాటవచ్చు. దీన్ని ప్రధానంగా గింజలు నాటడం, మొక్కలు నాటడం ద్వారం పెంచుతారు. ఇక వీటి జీవిత కాలంలో ఏకంగా 30 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఇక మార్కెట్‌లో కిలో చందనం 26-30 వేల రూపాయల వరకు పలుకుతుంది. ఒక చెట్టు నుంచి 15-20 కిలోల చందనం లభిస్తోంది. అంటే ఎంత లేదన్న సులబంగా ఒక చెట్టు నుంచి 5-6 లక్షల రూపాయలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. దీర్ఘకాలంలో భారీ లాభాలు పొందాలనుకునే వారికి ఎర్రచందనం సాగు ఎంతో శ్రేష్టం అంటున్నారు నిపుణులు. అయితే అన్ని వ్యాపారాల్లానే దీనిలో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక.. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.