సినిమా షూటింగ్స్ లో హీరోలు గాయపడటం ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని సార్లు ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నేరుగా పాల్గొంటుంటారు.. ఆసమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు హీరోయిన్స్ కూడా గాయాల భారీన పడుతుంటారు. తాజాగా కన్నడ నటి సంయుక్తా హెగ్డే షూటింగ్ లో గాయపడింది. వివరాల్లోకి వెళితే.. తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘కిరాక్ పార్టీ’ మూవీలో నటించిన సంయుక్తా హెగ్డే ఓ షూటింగ్ సమయంలో గాయపడింది. ప్రస్తుతం ఆమె క్రీమ్ అనే చిత్రంలో నటిస్తుండగా.. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో సంయుక్త కిందపడటంతో మోకాలికి బలమైన గాయమైందని.. తనను కొన్ని రోజులు వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సంయుక్త హెగ్డే తెలిపారు. ఇక ప్రస్తుతం తాను నటిస్తున్న క్రీమ్ మూవీ షూటింగ్ సమయంలో తాను ఎలా గాయపడ్డాను అన్న విషయం ప్రేక్షకులకు చూపించడం కోసం సంయుక్తా హెగ్డే మేకింగ్ వీడియో విడుదల చేశారు. తనకు గాయమైనప్పటికీ... సినిమా విడుదలైన తర్వాత ఆ ఫైట్ చూశాక ప్రేక్షకులు అందరూ మెచ్చుకుంటారని పేర్కొన్నారు. 'కాలేజ్ కుమార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల 'ఆహా'లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా 'మన్మథ లీలై'లో నటించింది. ప్రస్తుతం సంయుక్తా హెగ్డేకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.