Arjun Kapoor: ఇషాక్ జాదే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కపూర్ కి కెరీర్ లో చెప్పుకోతగ్గ హిట్స్ ఏమీ లేవు. ఇషాక్ జాదే, టూ స్టేట్స్ తప్పితే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఫ్లాప్ లుగానే నిలిచాయి. ఫ్లాప్ లు వస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం తలుపు తట్టడం మానడం లేదు. ఏదోలా అవకాశాలు దక్కించుకుని సినిమాలు చేస్తున్నాడు. అంతా బానే ఉంది కదా.. మరి అర్జున్ కపూర్ ఫ్లాట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అని ఇప్పుడు అభిమానులు బుర్రలు బాదుకుంటున్నారు. అర్జున్ కపూర్ తన 4BHK ఫ్లాట్ ను అమ్మేశాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాంద్రాలో తన గర్ల్ ఫ్రెండ్ అయిన మలైకా అరోరా నివాసానికి దగ్గరలో ఉన్న దాదాపు రూ. 16 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ను అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. 4,364 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్లాట్.. కేసీమార్గ్ లోని ఓ అపార్ట్ మెంటులో 19వ అంతస్తులో ఉంది. అర్జున్ కపూర్ సోదరి, అన్షులా కపూర్ కూడా ఈ ఫ్లాట్ సేల్ డాక్యుమెంట్స్ పై సంతకం చేసినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. అభిమానులు మాత్రం షాక్ లో ఉన్నారు.
ప్రస్తుతం అర్జున్ కపూర్ చేతిలో.. ఏక్ విలన్ రిటర్న్స్, కుత్తే, ది లేడీ కిల్లర్ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో 2014లో రిలీజై సంచలన విజయం సాధించిన ‘ఏక్ విలన్’ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ‘ఏక్ విలన్ రిటర్న్స్’ మూవీలో.. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 29న విడుదల కాబోతుంది. మరి అర్జున్ కపూర్ ఫ్లాట్ అమ్ముకున్నాడని వచ్చిన వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: విద్యార్థులతో కలిసి హీరో నాగచైతన్య డ్యాన్స్..
ఇది కూడా చదవండి: Vijay Deverakonda: ఆ రోజు ఇండియా మెుత్తం షేక్ అవుతుంది: విజయ్ దేవరకొండ