సినిమాల్లో హీరోలు, హీరోయిన్ లు డ్యాన్స్ లు చెయ్యడం కామన్. కానీ బయట వారు కాలు కదపాలంటే కాస్తా సిగ్గుపడతారు. మరి అదే అభిమానులు ముచ్చట పడితే కాదనలేరు. తాజాగా హీరో మహేశ్ బాబు, తమన్ తో కలిసి డ్యాన్స్ వేయడం మనం చూశాం. అలాంటి అనుభవమే హీరో నాగచైతన్యకు ఎదురైంది. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.. ప్రస్తుతం హీరో నాగచైతన్య డైరెక్టర్ విక్రమ్ కుమార్ కొండా దర్శకత్వంలో 'థ్యాక్యూ'మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం జులై22న థియేటర్లలోకి రానుంది. దీంతో యూనిట్ మెుత్తం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దానిలో భాగంగానే తాజాగా స్టూడెట్స్ తో ఓ మ్యూజికల్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య, తమన్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడి స్టూడెట్స్ ఆనందంతో గోలగోల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గామారింది. విద్యార్థులతో కలిసి హీరో నాగచైతన్య డ్యాన్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: రామ్ చరణ్ “రంగస్థలం”లో కూడా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్! సుకుమార్ అప్పట్లోనే! ఇదీ చదవండి: Tanushree Dutta: బాలకృష్ణ హీరోయిన్ పై భారీ కుట్ర! సంచలనం రేపుతున్న స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు!