తెలుగు బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తున్న యాంకర్ లలో వర్షిణి సుందరరాజన్ ఒకరు. తెలుగులో యాంకర్ రష్మీ, అనసూయ, శ్రీముఖిల తర్వాత స్థానం వర్షిణిదే అని చెప్పాలి. కానీ వాళ్ళకి వచ్చిన క్రేజ్ ఈ భామకి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం యాంకర్ వర్షిణి బుల్లితెరకు కూడా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ షోలు లేవని టాక్ నడుస్తుంది. సరే సినిమాలతో అయినా బిజీ అవుతుందని అనుకుంటే వర్షిణి చేతిలో శాకుంతలం సినిమా తప్ప వేరే ఏవి లేవని తెలుస్తుంది.
ఈ క్రమంలో చేతిలో సినిమాలు, టీవీ షోలు లేకపోయినా వర్షిణి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. అదిరిపోయే గ్లామరస్ ఫోటోషూట్స్ తో కుర్రకారు మతులు పోగొడుతోంది. వర్షిణి సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో సుమారు 1.8 మిలియన్స్ ఫాలోయింగ్ కలిగిన ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
మొదట మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించిన వర్షిణి.. 2014లో ‘చందమామ కథలు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక లాభం లేదని యాంకరింగ్ ఎంచుకుంది. యాంకరింగ్ లో క్రేజ్ వచ్చాక మళ్లీ సినిమాలవైపు మళ్లింది. నెట్టింట హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్ కి కనువిందు కలిగిస్తోంది కానీ సినీ అవకాశాలను రాబట్టుకోలేకపోతోంది.
ఇక వర్షిణి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే అమ్మడు తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే.. ఒప్పుకోక తప్పదు. అందం హిందోళం.. అధరం తాంబూలం.. అనే విధంగా వర్షిణి కొత్త ఫోటోలు ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో.. మత్తెక్కించే చూపులతో మాయ చేస్తోంది వర్షిణి. ప్రస్తుతం వర్షిణి పిక్స్ నెట్టింట కాక పుట్టిస్తున్నాయి. మరి యాంకర్ వర్షిణి లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.