డైరెక్ర్ శోభన్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా.. సంతోష్ శోభన్ తనకంటూ ఒక బ్రాంట్ క్రియేట్ చేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టు, సపోర్టింగ్ రోల్స్ నుంచి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. అటు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్ లో కూడా నటించి సంతోష్ శోభన్ మెప్పించాడు. తాజాగా సంతోష్ శోభన్ నటించిన కల్యాణం కమనీయం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. జనవరి 14న విడుదల కానున్న సినిమాకి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
ప్రమోషన్స్ లో భాగంగా కల్యాణం కమనీయం సినిమా టీమ్ సుమ లేటెస్ట్ షో అయిన సుమ అడ్డాకి వచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుంత వైరల్ అవుతోంది. హీరో- హీరోయిన్- డైరెక్టర్, సద్దాంలను సుమ తనదైనశైలిలో ఆడేసుకుంది. సుమ పంచుల వర్షానికి వాళ్లంతా తడిసిముద్దయిపోయారు. ముఖ్యంగా డైరెక్టర్ ని సుమ ఓ ఆటాడుకుంది. వర్షం పాటను ప్లే చేసి సద్దాంలో త్రిషను చూసుకుని రొమాంటిక్ స్టెప్పులేయాలని డైరెక్టర్ ని కోరింది. మరోవైపు హీరోని కూడా ఆడేసుకుంది.
సంతోష్ శోభన్ ని అయితే యాంకర్ సుమ నిండా ముంచేసింది. అతని ఫోన్ అడిగి తీసుకున్న సుమ అతని వాట్సాప్ చాటింగ్ బయట పెట్టింది. స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసి.. సంతోష్ శోభన్ వాట్సాప్ చాటింగ్ హిస్టరీ మొత్తాన్ని లీక్ చేసింది. అందులో టాలీవుడ్ హీరోయిన్లు మొత్తం ఉన్నారు. అనుపమ, త్రిష, కేథరిన్, అవికా, కావ్యలతో చాటింగ్ చేసినట్లు ఉంది. అయితే చివర్లో సన్నీ లియోన్ పేరు కూడా ఉంది. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా సన్నీకి సంతోష్ శోభన్ పంపిన మెసేజెస్ మొత్తం డిలీట్ చేసున్నాయి.
అవి మొత్తం లెక్కపెట్టగా 16 డిలీటెడ్ మెసేజెస్ అవి. ఇవన్నీ లీక్ చేసి సంతోష్ శోభన్ ని సుమ నిండా ముంచేసింది. సినిమా ప్రమోషన్ కోసం వస్తే.. మంచి పబ్లిసిటీ ఇచ్చింది. అయితే ఇందతా షోలో భాగంగా చేసిన ఫన్నీ సీన్ గా చెబుతున్నారు. అది సంతోష్ శోభన్ ఫోన్ కాదని.. ఊరికే అలా చేశారని చెబుతున్నారు. సంతోష్ శోభన్ ఇలాగే వరుస సినిమాలతో దూసుకుపోవాలని, హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతోష్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. తాజాగా బాలయ్య షోలో సంతోష్ శోభన్ కు ప్రభాస్ సపోర్టింగా ఉన్నాడనే విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.