యాంకర్ సుమ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ షో చేసినా.. ఏ ఈవెంట్ చేసినా సుమ యాంకర్ గా ఉందంటే అభిమానులలో కూడా ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే.. బుల్లితెరపై సుమ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఇప్పట్లో పూర్తవదు. సో.. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న సుమ.. ఎప్పటికప్పుడు కొత్త సినిమాల ఈవెంట్స్ తో పాటు సరికొత్త టీవీ షోలను కూడా తెరపైకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ‘సుమ అడ్డా’ అనే లేటెస్ట్ ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇదివరకు ప్రతి శనివారం సుమ హోస్ట్ చేసిన కాష్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుండేది.
ఇప్పుడు కాష్ ప్లేస్ లో సుమ అడ్డా అనే సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇక జనవరి 7న ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. కాగా.. ఈ ఎపిసోడ్ కి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ‘కళ్యాణం కమనీయం’ మూవీ టీమ్ పాల్గొన్నారు. హీరో సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ లతో పాటు దర్శకుడు కూడా పాల్గొన్నాడు. అయితే.. ప్రోమో అంతా చాలా సందడిగా సాగినప్పటికీ, చివరలో సంతోష్ వాట్సాప్ చాట్ ని సుమ లీక్ చేయడమే హైలైట్ గా మారింది. సంతోష్ వాట్సాప్ లో అనుపమతో చాటింగ్ ని బయటపెట్టిన సుమ.. సన్నీ లియోన్ కి మెసేజులు పెట్టిన విషయం కూడా లీక్ చేయడం విశేషం. ప్రస్తుతం ఫన్నీగా ఉన్న ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ సరికొత్త సుమ అడ్డా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.