తెలుగు బుల్లితెరపై చాలానే యాంకర్స్ ఉన్నారు. కానీ.., వెండితెరని హీట్ ఎక్కించిన మొట్ట మొదటి హాట్ బ్యూటీ అంటే అనసూయ పేరే వినిపిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా కెరీర్ చేసిన అనసూయ… ఆ ఆతరువాత తనదైన రీతిలో బుల్లితెరపై దూసుకుపోయింది. ఈ ప్రయాణంలో అనసూయని అభిమానించిన వారు ఎంత మంది ఉన్నారో, విమర్శించే వారు అంతే మంది ఉన్నారు. కానీ.., అను మాత్రం ఏనాడూ వీటిని పట్టించుకోలేదు.
ముఖ్యంగా అనసూయ ధరించే బట్టల విషయంలో చాలా కాలంగా చర్చ నడుస్తూనే ఉంది. మొన్నటి మొన్న యాంకర్ శివ కూడా జబర్దస్త్ స్టేజ్ పై ఈ విషయంలోనే నానా రచ్చ చేశాడు. కాగా.., ఇప్పుడు ఇదే విషయంలో మరో సీనియర్ యాంకర్ సుమ కనకాల కూడా నోరు జారి మళ్ళీ రచ్చకి కారణం అయ్యింది.
తెలుగు నాట యాంకర్ అనే మాటకి పర్యాయపదంగా మారిపోయింది సుమ. వయసు పైన పడుతున్నా.. ఈమె దూకుడు మాత్రం తగ్గడం లేదు. అన్నీ షోలలోనూ సుమనే దర్శనం ఇస్తుంది. ఇక ఈమె క్యాష్ షో అయితే వెండితెర చరిత్రలో కనీవినీ ఎరుగని హిట్. ఇందులో భాగంగా తాజాగా ఎపిసోడ్ కి యాంకర్ అనసూయ, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, నటులు ప్రియదర్శి, అభినవ్ గోమటం గెస్ట్ లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో సుమ స్టేజ్ పైనే అనసూయ పరువు తీసేసింది.
ఇంద్రజతో అయ్యో ఎంత మర్యాదండీ మీకు.. ఇక్కడ ఎవరికీ లేదు.” అని సుమ అంటుండగా.. వెంటనే అనసూయ “అక్కా.. ఏం మాట్లాడుతున్నారు.. నాకు రెస్పెక్ట్ లేదా” అంటూ సుమ కాళ్లు పట్టుకోబోయింది… “నువ్వు అంత వంగకు ప్లీజ్” అంతకు మించి వంగితే చూడలేము అంటూ అనసూయ పొట్టి డ్రెస్‌ను చూస్తూ కామెంట్ చేసింది సుమ. దీంతో.., అనసూయతో పాటు.., తోటి కంటెస్టెంట్స్ కూడా ఒక్కసారిగా అవాక్కయిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇన్ని ట్రోల్స్ తరువాతనైనా అనసూయ డ్రెసింగ్ మార్పు వస్తుందో లేదో చూడాలి.