సాధారణంగా గ్లామర్ షో విషయంలో ఎక్కువగా హీరోయిన్స్ పేర్లే వింటుంటాం. కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్లతో పోటీపడుతూ అందాలను ఆరబోస్తున్నారు టీవీ యాంకర్లు. తెలుగు బుల్లితెరపై గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్లలో అనసూయ, రష్మీ గౌతమ్ ల తర్వాత శ్యామల పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పెద్దగా టీవీ షోలలో కనిపించకపోయినా సినిమా ఈవెంట్స్ తో, కొత్త కొత్త ఫోటోషూట్ లతో బిజీగా ఉంటోంది శ్యామల.
సోషల్ మీడియాలో యాంకర్ శ్యామల గ్లామర్ ట్రీట్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చీరలో డాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేసింది. బ్లూ సారీలో శ్యామల అలా లూస్ హెయిర్ తో వయ్యారంగా చేసిన స్టెప్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ప్రస్తుతం శ్యామల డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది,. మరి శ్యామల వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.