తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు, సినీ ప్రియులకు గ్లామరస్ యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోకాలంగా అటు సినిమాలలో నటిగా, ఇటు జబర్దస్త్ లాంటి కామెడీ షోలకు యాంకర్ గా రాణిస్తున్న రష్మీకి సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా సరైన హిట్స్ లేక ఇలా యాంకర్ గా ఉండిపోయింది గానీ.. హీరోయిన్ గా స్టార్డమ్ అందుకునే రేంజ్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తోంది రష్మీ. బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రష్మీ.. సమాజంలో ఎలాంటి ఇష్యూ జరిగినా, ఏ ఫెస్టివల్స్ కైనా తన శైలిలో స్పందిస్తుంటుంది.
ఇక రష్మీ రీల్ లైఫ్ లో గ్లామరస్ బ్యూటీ అనిపించుకున్నా.. వ్యక్తిగతంగా మాత్రం జంతు ప్రేమికురాలు. అలాగే మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకుంది. అయితే.. బుల్లితెరపై రష్మీకి ఇంత ఫేమ్ రావడానికి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా ఓ రీజన్ అని చెప్పాలి. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు రష్మీ, సుధీర్ తమదైన కామెడీ స్టైల్ లో అందరినీ నవ్వించారు. ఈ క్రమంలో రెగ్యులర్ గా వెళ్లే షోల కోసమే రష్మీ.. ఎంతో అందంగా ముస్తాబవుతుంది. అలాంటిది దీపావళి లాంటి ఫెస్టివల్ వస్తే.. ఎలా ఉంటుందో తాజాగా ఫోటోలు పోస్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది.
యాంకర్ రష్మీ దీపావళి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆమె పోస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్టులే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పింక్ చుడిదార్ లో రష్మీ.. దీపావళికి ఇల్లంతా దీపాలను అలంకరించి ఫెస్టివల్ మూడ్ ని ఎంజాయ్ చేసింది. అలాగే లక్ష్మీదేవిని పూజించి, తన పెట్ తో పాటు ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ శుభాకాంక్షలను తన ఫ్యాన్స్ కి తెలియజేసింది. అయితే.. ప్రస్తుతం రష్మీ ఒంటరిగానే దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ ఫోటోలలో రష్మీ తన పెట్ ని ముద్దాడుతూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఆ పెట్ ని రష్మీ ముద్దాడటంతో.. ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ తమ కొంటె కోరికలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పెట్ డాగ్ ని ఉద్దేశించి.. తాము కూడా రష్మీ ఇంట్లో పెట్ లాగా మారిపోతే ఎంత బాగుండో అంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం విశేషం. ఇక రష్మీ కెరీర్ విషయానికి వచ్చేసరికి.. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ఫుల్ బిజీ అయిపోయింది రష్మీ. ఓవైపు టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తోంది. త్వరలోనే రష్మీ హీరోయిన్ గా నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.