బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని యాంకర్ లాస్య.. ఈ మధ్య అటు టీవీ షోలలో, ఇటు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపించడం లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన లాస్య.. బిగ్ బాస్ 4వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. టీవీ షోలలో అడపాదడపా కనిపించే లాస్య.. అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది.
కొంతకాలంగా సొంత యూట్యూబ్ ఛానల్ ‘లాస్య టాక్స్’ మెయింటైన్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా లాస్య ఓ ర్యాప్ సాంగ్ పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. మాతృదినోత్సవం సందర్భంగా లాస్య పాడిన ‘సావేజ్ మామ్’ అనే ర్యాప్ సాంగ్ తన సొంత యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది. ‘ఏజ్ బార్ అనుకోవద్దు న్యూ ఏజ్ మామ్ నేను.. ర్యాప్ తోని ఇరగదీస్తా సావేజ్ మామ్ నేను.. బాసాన్లు తోమమంటే సాకులన్ని చెప్తవు.. బుక్కు ముందు పెట్టుకుని గురకపెట్టి పంటవు.. అంటూ అదరగొట్టింది లాస్య. ప్రస్తుతం లాస్య పాడిన ర్యాప్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.