బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన లాస్య.. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా మెరిసింది. అనంతరం మంజునాథ్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే.. లాస్య ఇటీవల ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో లాస్యకు ఏమైందో అంటూ ఆమె ఆరోగ్యం గురించి ఎన్నో కథనాలు బయటికి వచ్చాయి. తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాక ఏమి కాలేదని, వైరల్ ఫీవర్ అని చెప్పింది.
ఇక ఇప్పుడు లాస్య ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెబుతూ మరోసారి వార్తల్లో నిలిచింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నానని స్వయంగా యూట్యూబ్ వీడియోలో చెబుతూ ఎమోషనల్ అయ్యింది లాస్య. మొదటగా ఇంట్లోనే టెస్ట్ చేసుకున్న లాస్య.. ఆ తర్వాత డాక్టర్ ని కలిసి కన్ఫర్మ్ చేసుకున్నట్లు వీడియోలో తెలిపింది. అలాగే భర్త మంజునాథ్ తో కలిసి తన మెడికల్ రిపోర్ట్స్ చూపించింది. అయితే.. లాస్యకు మొదటి సంతానంగా కొడుకు జన్మించాడు. ఆ బాబుకు లాస్య ముద్దుగా జున్ను అని పిలుస్తుంటుంది.
ఇదిలా ఉండగా.. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత లాస్య రెండోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ లాస్యనే స్వయంగా సోషల్ మీడియాలో బహిర్గతం చేసేసరికి.. ఫ్యాన్స్, నెటిజన్స్, సన్నిహితులు ఇలా అందరూ లాస్యకు విషెస్ చెబుతున్నారు. అలాగే లాస్య ఆరోగ్యం కూడా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా యాంకర్ లాస్య.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తోంది. మరి యాంకర్ లాస్య గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.