ప్రస్తుతం ఓ పాపులర్ యాంకర్ పేరు చాలాకాలం తర్వాత వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లపాటు తెలుగులో యాంకరింగ్ తో పాటు సినిమాలలో కూడా క్యారెక్టర్స్ పోషించిన ఆ బ్యూటీ.. పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసి భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. అశ్విని శర్మ.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు. కానీ, ఫేస్ చూస్తే ఇట్టే గుర్తుపడతారు.
చిత్రపరిశ్రమలో సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంటుంది. ముఖ్యంగా కొన్నాళ్ళు ఇండస్ట్రీలో యాక్టీవ్ గా ఉండి.. సడెన్ గా కనిపించకుండా పోయిన సెలబ్రిటీల గురించి ఏ కొత్త న్యూస్ తెలిసినా కలిగే ఆనందం వేరు. పైగా సెలబ్రిటీల గుడ్ న్యూస్ తో బయటికి వస్తే.. ఖచ్చితంగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఓ పాపులర్ యాంకర్ పేరు చాలాకాలం తర్వాత వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లపాటు తెలుగులో యాంకరింగ్ తో పాటు సినిమాలలో కూడా క్యారెక్టర్స్ పోషించిన ఆ బ్యూటీ.. పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసి భర్తతో అమెరికా వెళ్ళిపోయింది.
ఇండస్ట్రీకి దూరమైనా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు కదా.. ఆ విధంగా ఇప్పుడు ఆ యాంకరమ్మ ట్రెండింగ్ లోకి పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇంతకీ ఆ యాంకర్ ఎవరో కాదు.. అశ్విని శర్మ. ఆమె పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు. కానీ, ఫేస్ చూస్తే ఇట్టే గుర్తుపడతారు. అదీగాక ఛత్రపతి మూవీలో హీరోయిన్ శ్రియ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంటే.. ఇంకా సులభంగా గుర్తురావచ్చు. ఛత్రపతిలో హీరోయిన్ పక్కనే ఉంటూ.. ప్రభాస్ ని చూసినప్పుడు ‘గురుడు గుంజినట్లున్నాడు’ అనే డైలాగ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అశ్విని.. అప్పటికే చేతినిండా టీవీ షోస్ తో, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ తో బిజీగా లైఫ్ లీడ్ చేసింది.
చిన్నప్పుడే టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అశ్విని.. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, చిరంజీవి, నాగార్జున.. ఇలా దాదాపు ఇప్పుడు స్టార్స్ గా ఉన్న హీరోలందరిని ఇంటర్వ్యూస్ చేసిన అశ్విని.. కొడుకు, పల్లకిలో పెళ్లికూతురు, ధైర్యం, హీరో, ఛత్రపతి లాంటి సినిమాలు చేసింది. నీకోసం, ఖుషి, మలబార్ గోల్డ్ ఆనందం, జస్ట్ ఫర్ ఫన్, మా టాకీస్, వారెవ్వా క్యా బాత్ హే.. లాంటి ఎన్నో టీవీ షోస్ చేసింది. ఓవైపు టీవీ షోస్ చేస్తూనే చదువు కొనసాగించిన అశ్విని.. నవగ్రహ కీర్తనలను 108 నిముషాలు అనర్గళంగా ఆలపించి గిన్నిస్ బుక్ రికార్డులోకెక్కింది అశ్విని.
ఇక ఫ్యాషన్ డిజైనింగ్ లో మక్కువతో లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో టెక్స్ టైల్స్ కోర్స్ పూర్తి చేసింది అశ్విని. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్ ప్రతీక్ ని పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్లిపోయింది. అప్పటినుండి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అశ్విని.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటోంది. తాజాగా భర్తతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. దీంతో అశ్వినితో పరిచయం ఉన్న యాంకర్స్, సెలబ్రిటీస్ తో పాటు ఫ్యాన్స్ ఆమెను విష్ చేస్తున్నారు. ప్రెజెంట్ అశ్విని ప్రెగ్నన్సీ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు తన పేరుమీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది అశ్విని శర్మ. మరి అశ్విని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.