యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాకంర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ కెరీర్ రంగస్థలం సినిమాతో పూర్తిగా టర్న్ అయ్యింది. ఆ సినిమా విజయంతో అనుసూయకు అవకాశాలు వరుస కట్టాయి. తాజాగా వచ్చిన పుష్ప చిత్రంలో కూడా అనసూయ కీలక పాత్రలో నటించింది. ఇవే కాక ఆమె నటించిన.. రంగమార్తండ, పుష్ప-2 వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తమిళ్‌లో కూడా ప్రభుదేవా డైరెక్షన్‌లో రెండు సినిమాలకు సైన్ చేసింది అనసూయ. వరుస సినిమాలు చేస్తూనే.. టీవీ షోలు కూడా చేస్తుంది అనసూయ. ఇక ఏ విషయం గురించి అయినా సరే ముక్కుసూటిగా.. కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానం చెప్పడం అనసూయ నైజం. దాంతో ఆమె తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో ఆమె మీద జరిగే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వారందరికి తగిన రీతిలో సమాధానం చెప్పి.. ట్రోలర్స్ నోరు మూయిస్తుంది అనసూయ. ఈ క్రమంలో తాజాగా అనసూయ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తెగ వైరలవుతోంది. దీనిలో ఇండస్ట్రీలో మహిళలను ఎలా చూస్తారో చెప్పుకొచ్చింది అనసూయ.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే.. ముఖ్యంగా హీరోయిన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. హీరోయిన్ అంటే కెమరా ముందు కాపాడండి.. లేదంటే సిగ్గుపడుతూ నవ్వాలి. అంతే. అదే మా పని. అసలు మాట్లాడకూడదు. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్ ఉంది కదా.. సేమ్ ఇక్కడ పరిస్థితి అలానే ఉంటుంది. మా హక్కుల కోసం మాట్లాడితే.. మాపై ఇంట్రస్ట్ పోతుంది. హీరోయిన్ అంటే దేవదాసిలా పని చేయాలి అన్నట్లు చూస్తారు కానీన అది చాలా తప్పు’’ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.
అంతేకాక.. ‘‘మీలాగే మేం కూడా మాని చేస్తున్నాం.. మా జీతాలు మేం తీసుకుంటున్నాం. కానీ మా ప్రపంచంలో ఏమౌతుందో అని మీకు ఫోకస్ ఎక్కువ. అసలు మా సినిమాలు చూసే అర్హత మీకుందా అని మేం ఆలోచించడం మొదలు పెడితే.. ఎవడొస్తాడు థియేటర్‌కి’’ అని ప్రశ్నించింది. ‘‘మీకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలని సరదా.. అంటే థియేటర్‌కి వచ్చి మూవీ చూడాలి. మాకు అదే వర్క్. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నా కుటుంబం మద్దతు వల్లే’’ అని చెప్పుకొచ్చింది.
‘‘నేను మాట్లాడకుండా ఉన్నా సరే నా వైపు వేలెత్తి చూపించిన వాళ్లు ఉన్నారు. మాట్లాడితే తప్పు అన్నవాళ్లు ఉన్నారు.గత కొన్నేళ్ల నుంచి ఇలాంటి వాటి గురించి నాకు నేను నచ్చజెప్పుకుంటున్నాను’’ అని వెల్లడించింది అనసూయ. ఆమె చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతోంది. అనసూయ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.