అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. అప్పటికే వారి కుటుంబంలో అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బన్నీ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్ కెరీర్ మాత్రం ఆశించిన మేర సక్సెస్ కాలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కావొస్తున్నా.. శిరీష్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. 2013లో గౌరవం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు శిరీష్. ఇక పదేళ్ల కెరీర్‌లో మలయాళంతో కలిసి కేవలం ఏడు చిత్రాల్లో మాత్రమే నటించాడు. ఇక తాజాగా ఊర్వశివో రాక్షసివో చిత్రం ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.
నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్‌ని హీరోగా టాలీవుడ్‌కి పరిచయం చేసిన రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అల్లు శిరీష్ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు అడిగాడు. ‘‘మీ జీవితంలో ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించారు. కానీ తర్వాత మీరే బ్రేకప్ చెప్పారని వార్తలు వచ్చాయి. వీటిపై మీ స్పందన ఏంటి’’ అని అడగ్గా.. అందుకు అల్లు శిరీష్.. ‘‘నా జీవితంలో రెండు మూడు సీరియస్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అయితే వారందరితో నాకు బ్రేకప్ అయ్యింది. అలా చూసుకుంటే నా జీవితంలో.. ఒకటి కాదు.. రెండు, మూడు బ్రేకప్స్ ఉన్నాయి. వారితో చాలా క్లోజ్ అయిన తర్వాత బ్రేకప్ అయిందని’’ చెప్పుకొచ్చాడు శిరీష్. అందుకు సదరు యాంకర్.. ‘‘అవన్ని ఏమో కానీ.. ఒక పెద్దింటి అమ్మాయి.. మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయితో కూడా మీకు బ్రేకప్ అయిందట కదా’’ అని ప్రశ్నిస్తే.. అందుకు శిరీష్.. అవునని చెప్పడమే కాక.. ఆమెకు తానే బ్రేకప్ చెప్పానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత సదరు యాంకర్.. ‘‘మరి ఆ బ్రేకప్ తర్వాత దాని గురించి మీరు ఎప్పుడైనా బాధపడ్డారా.. అరే ఆరోజు అలా బ్రేకప్ జరిగుండకపోతే.. ఈ రోజు నా జీవితంలో కూడా అర్హానో, అయానో ఉండేవాడు కదా అని ఎప్పుడైనా అనిపించిందా’’ అని ప్రశ్నించాడు. అందుకు శిరీష్.. మనం తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో ఆ నిమిషం అర్థం కాదు. ఓ ఏడాది తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది’’ అన్నాడు.
‘‘అయితే బ్రేకప్ చెప్పినప్పుడు నేను బాధపడ్డాను. మీరు చెప్పినట్లే.. బ్రేకప్ జరగకపోతే.. ఈ పాటికి తననో.. లేదంటే మరో వ్యక్తితోనే.. అంటే ఆమెతో ప్రేమలో పడకపోతే.. నా వివాహం జరిగి ఉండేది కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అనవసరంగా బ్రేకప్ చెప్పుకొని టైం వేస్ట్ చేస్తున్నానేమోనని అనిపిస్తుందంటూ’’ ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. ప్రసుత్తం అతడి కామెంట్స్ వైరల్‌గా మారియి. మరి అల్లు శిరీష్ ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీసే పనిలో ఉన్నారు నెటిజనులు.