అల్లు ఫ్యామిలీ నుంచి హీరో అనగానే బన్నీనే గుర్తొస్తాడు. రోజురోజుకి తన క్రేజ్ పెంచుకుంటూ ప్రస్తుతం వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించాడు. అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శిరీష్.. పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాకపోతే అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. దాదాపు మూడేళ్లకు పైగా విరామం తర్వాత ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాడు. తాజాగా రిలీజైన ఆ సినిమా టీజర్.. ఫ్యాన్స్ ని అలరిస్తూ వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘గౌరవం’ సినిమాతో అల్లు శిరీష్ హీరోగా పరిచయమయ్యాడు. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్టుగా ప్రతిబంధ్, మాయబజార్ చిత్రాలు చేశాడు. ఇక తొలి సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శిరీష్.. ఆ తర్వాత కొత్తజంట, శీరస్తు శుభమస్తు, 1971, ఒక్క క్షణం, ఏబీసీడీ తదితర చిత్రాలు చేశాడు. చేయడమైతే చేశాడు గానీ ఫేమ్ సంపాదించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకుని.. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా చేశాడు. అందుకు సంబంధించిన టీజర్ ని గురువారం రిలీజ్ చేశారు.
కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ సినిమాకు తొలుత ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ పెట్టారు. ‘జతకలిసే,’ ‘విజేత’ లాంటి సినిమాలు తీసిన రాకేశ్ శని దర్శకుడు అని ప్రకటించారు. కానీ కరోనా రావడం, ఆ తర్వాత షూటింగ్ లకు ఇబ్బంది ఏర్పడటంతో ఈ ప్రాజెక్టు కాస్త లేటవుతూ వచ్చింది. దీని గురించి ప్రేక్షకులు మర్చిపోయారు. ఇప్పుడు సినిమా పేరు మార్చి టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు శిరీష్-అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ కేక పుట్టిస్తోంది. టీజర్ లో ఆ ముద్దు సన్నివేశాలు చూస్తూ, కుర్రాళ్లు కుదురుగా కూర్చోలేకపోతున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న సినిమాని థియేటర్స్ లోకి తీసుకొస్తామని ప్రకటించారు. మరి ఈ టీజర్ మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.