ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పాన్ ఇండియా సినిమా ఆధ్యుడు దర్శకధీరుడు రాజమౌళి అని అందరికీ తెలిసిందే. కానీ, టాలీవుడ్ సినిమాలపై బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి కోణాన్ని మార్చింది మాత్రం పుష్ప సినిమా అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో పుష్ప సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ సైతం ముక్కున వేలేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప సినిమా డైలాగులే. ఎవరిని కదిలించినా తగ్గేదేలే అనడమే. క్రికెటర్స్, ఫుట్ బాల్ ప్లేయర్స్, సెలబ్రిటీల నుంచి ఆఖరికి రాజకీయ నాయకులు సైతం పుష్ప డైలాగులు వల్లె వేశారు. ఇప్పుడు పుష్ప 2 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇదీ చదవండి: Mirzapur Season 3 రిలీజ్ ఎప్పుడంటే..!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 కోసం అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ దాదాపు రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లేదంటే బాలీవుడ్ కలెక్షన్స్ లో షేర్ అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలా చూసుకున్నా కూడా బన్నీకి ఓ రేంజ్ రెమ్యూనరేషన్ దక్కే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా, ప్రమోషన్స్ లేకుండానే పుష్ప సినిమా బీ టౌన్లో 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా కలెక్షన్లను అంచనా వేయడం కూడా కష్టమనే చెప్పాలి. మరోవైపు సుకుమార్ రెట్టించిన యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే పుష్ప- 2కి అల్లు అర్జున్ డైరెక్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నా, కలెక్షన్స్ లో షేర్ తీసుకున్నా కోట్లు కురవాల్సిందే. అల్లు అర్జున్ 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.