టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలతో జోరును కొనసాగిస్తున్నాడు ప్రముఖ హీరో అల్లు అర్జున్. ఆయన నటించిన పాన్ ఇండియా పుష్ప మూవీ ఈ మధ్యకాలంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం 360 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డునుక్రియేట్ చేసింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది.
అయితే పుష్ప మూవీని పార్ట్ 2గా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది. స్ట్రెయిట్ హెయిర్, బ్లాక్ టీ షర్ట్ లో బ్లాక్ అండ్ వైట్ లో బన్నీ స్టైలిష్ లుక్ లో సూపర్బ్ అనిపిస్తున్నాడు.
అయితే ఈ ఫోటోను సెలబ్రిటీ ఫొటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ తీసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫొటో షూట్ కు సంబంధించిన మరిన్ని ఫొటోలు త్వరలో విడుదల కానున్నాయట. స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బన్నీ లెటెస్ట్ లుక్ పుష్ఫ పార్ట్2 కోసమేనని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఏదైతేనేం కొత్త లుక్ లో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్న ఈ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: న్యూడ్ ఫోటోలతో మరో స్టార్ హీరో.. ఫోటోగ్రాఫర్ గా మారిన భార్య!