సినీ ఇండస్ట్రీలోకి కొత్త ట్రెండ్ వచ్చింది. అదే న్యూడ్ ఫొటో షూట్. ఏ ముహూర్తాన రణవీర్ సింగ్ ఈ ట్రెండ్ ను మొదలుపెట్టాడో కానీ.. ఒక్కో హీరో ఇదే పనిలో మునిగిపోతున్నారు. ఇప్పటికే న్యూడ్ గా రణవీర్ సింగ్ ను చూసి.. భీ చీ ఏంటీ దరిద్రం మాకు అనుకుంటున్న నెటిజన్లకు.. నేను కూడా రణవీర్ సింగ్ ను ఫాలో అవుతున్నాను అంటూ కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ నగ్నంగా ఫోజులిచ్చి సంచలనం సృష్టించాడు. ఈ ఫోటోలను స్వయంగా గుత్తా జ్వాలానే తీసిందట. విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ ప్రమోషన్స్‌తో మొదలైన ఈ ట్రెండ్‌ను వివిధ హీరోలు, నటులు ఫాలో అవుతూ కొనసాగిస్తున్నారు. విజయ్ దేవరకొండ తర్వాత ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు రాహుల్ ఖన్నా అర్ధనగ్నంగా ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొజులిచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) ఇక ఈ ఫొటోషూట్‌ను నెటిజన్లు చీల్చి చెండాడారు. తాజాగా విష్ణు విశాల్ ఇలాంటి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దానికి 'ఈ ట్రెండ్‌లో నేను కూడా జాయిన్ అయ్యా' అంటూ చెప్పుకొచ్చాడు. విష్ణు హీరోగానే కాకుండా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి గుత్తా జ్వాల భర్తగా సుపరిచితమే. Well... joining the trend ! P.S Also when wife @Guttajwala turns photographer... pic.twitter.com/kcvxYC40RU — VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) July 23, 2022 నడుము కింద వరకు కనిపించేలా, కేవలం దుప్పటి మాత్రమే అడ్డుపెట్టుకుని సెమీ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు విష్ణు విశాల్. 'నా భార్య గుత్తా జ్వాల ఫొటోగ్రాఫర్‌గా మారడంతో నేను కూడా ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో కూడా నెట్టింటి వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సెమీ న్యూడ్ ఫొటోలను ట్రెండ్‌గా తీసుకోని ఇంకెంతమంది హీరోలు ఫాలో అవుతారో చూడాలి. ఈ నయా ట్రెండ్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Vijay Deverakonda goes nude in Liger's new poster Read @ANI Story | https://t.co/s1QUZoeH3D#VijayDeverakonda #Liger pic.twitter.com/Vk0tdkqkKQ — ANI Digital (@ani_digital) July 2, 2022 ఇదీ చదవండి: Srinu Vaitla: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీను వైట్ల ఇదీ చదవండి: నెలలో మూడు రోజులు కేటాయించలేవా? అంటూ అనసూయను నిలదీసిన చలాకీ చంటి!