తెలుగు రాష్ట్రాలో ఎంతో ఆనందోత్సాహాల మద్య సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి వేడుకలకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటారు. భోగభాగ్యాలు తెచ్చే ఈ తెలుగు వారి అండుగ అంటే భోగి అంటారు. ప్రతి ఏడాది సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందు రోజు బోగి పండుగ జరుపుకుంటారు. సాంప్రదాయ పద్దతిలో పూజలు చేసి భోగిమంటలు వెలిగించి పండుగకు శ్రీకారం చుడుతారు. ఆవు నెయ్యితో భోగి మంటలు వెలిగిస్తారు. ఈ మంటల్లో ఇళ్లలోని పాత వస్తువులు వేస్తారు.. అలా వేయడం వల్ల దరిద్రం పోతుందని నమ్ముతారు తెలుగు ప్రజలు. ఇక ప్రతి సంవత్ససరం నారావారి పల్లెలో నారా – నందమూరి కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పడుంగ పురస్కరించుకొని నారా – నందమూరి కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సమేతంగా నారావారి పల్లెకు విచ్చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లెలో నందమూరి కుటుంబ సభ్యులు సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో బాలకృష్ణ జాగింగ్ చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన అందరినీ పలకరిస్తూ ఒక చోట ఆగి భోగిమంట వద్ద చలికాచుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు సినిమాల సందడి అన్నారు. తన సినిమా వీరసింహారెడ్డి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని జోస్యం చెప్పారు. ప్రజలు తమ మంచి కోసం మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. దేశంలో మరుగున పడుతున్న సాంప్రదాయాలను ఇలాంటి పండుగలు పునరుజ్జీవింపచేస్తామయి అభిప్రాయ పడ్డారు. భోగి మంటల్లాగానే అందరి జీవితాల్లో మంచి వెలుగు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించినన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తిరుపతి సమీపంలోని నారావారిపల్లెలో సినీ నటుడు , @JaiTDP హిందూపూర్ MLA నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా తన సోదరి ఇంటికి వచ్చిన బాలకృష్ణ బోగిమంటలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూభోగి పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు pic.twitter.com/TGUjSDI1Ar
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 14, 2023