అక్కినేని వారసుడు.. అఖిల్ ఏజెంట్ సినిమా కోసం షాకింగ్ స్టైల్ లో ట్రాన్స్ ఫామ్ అవుతున్నాడు. అఖిల్ బాడీ ట్రాన్సఫర్మేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అఖిల్ కు సంబంధించి సినిమాల పరంగా కాకుండో మరో వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదే అఖిల్ పెళ్లి విషయం గురించి. అవును.. తర్వరలోనే అక్కినేని అఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు జోరుగానే ప్రచారం జరుగుతోంది.
గతంలో అఖిల్ కు ప్రముఖ పాశ్రామిక వేత్తల కుటుంబానికి చెందిన శ్రీయా భూపాల్ తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలతో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత శ్రీయా భూపాల్ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు అనిందిత్ రెడ్డితో వివాహం జరిగింది. అఖిల్ మాత్రం ఇంతా పెళ్లి చేసుకోలేదు. కెరీర్ పై ఫోకస్ పెట్టి సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే నాగార్జున ఇప్పుడు అఖిల్ పెళ్లిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అమ్మాయిని కూడా సెలక్ట్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త కుమార్తెతో వివాహం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వారికి హైదరాబాద్ లోనూ పెద్దఎత్తున వ్యాపారాలు, ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ సక్రమంగా జరిగితే నాగార్జన త్వరలోనే ఈ వార్తను అధికారికంగా ప్రకటిస్తారంటున్నారు. వీలైనంత త్వరగా అఖిల్ ను పెళ్లి పీటలు ఎక్కించాలని కింగ్ నాగ్ ఫిక్స్ అయ్యాడంటున్నారు.