ఆదా శర్మ ప్రస్తుతం ‘ ది కేరళ స్టోరీ’ హిట్‌ను ఆస్వాధిస్తున్నారు. మే 11న పుట్టిన రోజు నాడు ఆమె శివాలయానికి వెళ్లారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ది కేరళ స్టోరీ’.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. అదే సమయంలో కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కాంట్రవర్సీల గురించి పక్కన పెడితే.. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ ఆదా శర్మకు ముందుటి కంటే ఎక్కువ క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, న్యూస్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
తాజాగా, ఆమె శివాలయంలో పూజలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన 31వ పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. గర్భగుడిలో శివుడికి దగ్గరగా కూర్చుని శివతాండవం మంత్రాలను ఉచ్ఛరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. ఆమె భక్తి భావానికి మంత్రాన్ని ఉచ్ఛరిస్తున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, ఆదా శర్మ ఆదివారం యాక్సిడెంట్‌కు గురయ్యారు.
ప్రస్తుతం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యంపై ఆదాశర్మ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ నేను బాగానే ఉన్నాను. మా యాక్సిడెంట్ గురించి చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారు. మా టీం, మేమందరం బాగానే ఉన్నాము. సీరియస్ కాదు! మీ చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. మరి, శివాలయంలో ది కేరళ స్టోరీ హీరోయిన్ ప్రత్యేక పూజలు చేయించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.