ఇండస్ట్రీలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు ఫేస్ చేసే మీటూ ఉద్యమం గురించి అప్పుడప్పుడు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇండస్ట్రీలో తాము ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్స్ గురించి బయట పెడుతూనే ఉన్నారు. కాగా.. చిత్రపరిశ్రమలో సంచలన రేపిన కాస్టింగ్ కౌచ్ 'మీ టూ' ఉద్యమంపై తాజాగా స్టార్ హీరోయిన్ సాయిపల్లవి స్పందించి.. తన అభిప్రాయాలను బయట పెట్టింది.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు ఫేస్ చేసే మీటూ ఉద్యమం గురించి అప్పుడప్పుడు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇండస్ట్రీలో తాము ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్స్ గురించి బయట పెడుతూనే ఉన్నారు. అయితే.. కొంతమంది విషయంలో కాస్టింగ్ కౌచ్ సంఘటనలు జరగనప్పటికీ.. దాని గురించి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు గళం విప్పుతున్నారు. కాగా.. చిత్రపరిశ్రమలో సంచలన రేపిన కాస్టింగ్ కౌచ్ ‘మీ టూ’ ఉద్యమంపై తాజాగా స్టార్ హీరోయిన్ సాయిపల్లవి స్పందించి.. తన అభిప్రాయాలను బయట పెట్టింది.
టాలీవుడ్ సింగర్ స్మిత హోస్ట్ గా ‘నిజం’ అనే టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోనీలివ్ లో ప్రసారమవుతున్న ఈ షోకి.. మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్స్ ఆల్రెడీ పాల్గొని మాట్లాడారు. ఇక ‘నిజం విత్ స్మిత’ షోలో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొన్న ప్రోమోని ఇటీవలే రిలీజ్ చేశారు నిర్వాహకులు. కాగా.. తన కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ తో పాటు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్న సాయిపల్లవి.. మీటూ ఉద్యమంపై కూడా తన గళం విప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ షోలో సాయిపల్లవి.. తాను ఇప్పటిదాకా ఎక్కడా రివీల్ చేయని విషయాలను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో హోస్ట్ స్మిత.. ‘ఒకప్పుడు మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టించింది. సోషల్ మీడియాలో ఎంతోమంది దీనిపై మాట్లాడారు. దీనిపై గురించి మీ ఉద్దేశం ఏంటి?’ అని అడగ్గా.. “మీరు శారీరకంగా వేధింపులకు గురిచేయకపోవచ్చు. కానీ, మాటలతో ఇబ్బంది పెట్టడం కూడా వేధింపులకు సమానమే అవుతుంది” అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారగా.. పూర్తి ఎపిసోడ్ మార్చి 10 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సాయిపల్లవి తెలుగులో విరాటపర్వం సినిమా తర్వాత వేరే సినిమాలేవీ ఒప్పుకోలేదు. గతేడాది గార్గితో హిట్ కొట్టిన ఈమె.. ప్రెజెంట్ శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది. మరి మీటూ ఉద్యమంపై సాయిపల్లవి చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.