సాధారణంగా అభిమాన సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి కొత్త వార్తలు వినిపించినా, ఎప్పుడూ చూడని ఫోటోలు కనిపించినా సర్ప్రైజ్ అయిపోతుంటారు అభిమానులు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేసేస్తుంటారు. గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేకపోవడంతో హీరోహీరోయిన్లకు సంబంధించి ఏ వార్తలైనా టీవీ న్యూస్ లేదా న్యూస్ పేపర్స్ ద్వారా తెలుసుకునేవారు. కానీ.. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎప్పుడో గతంలో ఫోటోషూట్స్ చేసి, మర్చిపోయిన జ్ఞాపకాలు కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
ఈ క్రమంలో కెరీర్ తొలినాళ్లలో స్టార్డమ్ ని అందుకొని.. దక్షిణాది స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన గ్లామరస్ హీరోయిన్ రోజా. తెలుగుతో పాటు తమిళంలో స్టార్స్ అందరి సరసన సినిమాలు చేసిన రోజా.. తాను సినిమాలు చేసిన దర్శకుడినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అలా హీరోయిన్ గా సినిమాలు ఆపేశాక కొంత గ్యాప్ తీసుకొని మదర్ రోల్స్ కూడా చేసింది. ఆ తర్వాత పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించింది. ఇక ఏపీ రాజకీయాల్లో రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా.. ప్రస్తుతం మంత్రి పదవీలో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. సినీ కెరీర్ లో ఎందరో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రోజా.. బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేయలేదు. కానీ.. తాజాగా రోజాకు సంబంధించి ఓ సర్ప్రైజింగ్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ రోజా ఫోటో మేటర్ ఏంటంటే.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో కలిసి రోజా హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు దిగిన పిక్ అది. ఆ ఫోటోలో రోజా, షారుఖ్ కలిసి ఉన్నారు. అయితే.. వారిద్దరూ ఈ ఫోటో ఎప్పుడు దిగారు.. ఏదైనా సినిమా ఈవెంట్ లో కలిశారా లేక ఇద్దరూ కలిసి ఏదైనా ఫోటోషూట్ చేశారా? అనే వివరాలు తెలియలేదు. కానీ.. షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా విషెష్ చెబుతూ ఈ పిక్ షేర్ చేసింది రోజా.
Happy birthday to @iamsrk 🎂 pic.twitter.com/ahC5ffvs5p
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 2, 2022