జవాన్ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో నటిస్తున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఒకరు కోలీవుడ్ హీరో అయితే, మరొకరు టాలీవుడ్ స్టార్ హీరో అని ఫ్యాన్స్ ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఆ స్టార్ ఎవరు?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు మధ్య ట్వీటర్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. మా వాడు గొప్ప అంటే.. మా వాడు గొప్ప అంటూ.. ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన బంగ్లాలు కలిగిన హీరోల్లో షారుఖ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఆయనకు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు యువకులు కలకలం సృష్టించారు. గోడ దూకి మరీ..
షారుక్ ఖాన్ బాలీవుడ్ బాద్‌షా అని మరోసారి రుజువు చేసుకున్నాడు. షారుక్ నుంచి నాలుగేళ్ల తర్వాత వచ్చిన పఠాన్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పఠాన్ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రోజుకో రికార్డు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నారు. నిజానికి పఠాన్ మూవీ ఒక్క షారుక్ ఖాన్ లో మాత్రమే ఆశలు పెంచలేదు.. యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశలు చిగురింపజేసింది. బాలీవుడ్ నుంచి కొన్నేళ్లుగా సరైన హిట్టు రాలేదు. ఇప్పుడు ఆ […]
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కేవలం నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా, వ్యాపార వేత్తగా పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఇటీవల షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ వివాదం బాలీవుడ్ లో సంచలనం రేపింది. తాజాగా షారూఖ్ ఖాన్ కి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. షార్జాలో ఒక […]
కోలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో అట్లీ కుమార్ కూడా ఒకరు. ఎన్నో భారీ చిత్రాలు నిర్మించి.. వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. తాజాగా అట్లీ.. షారుక్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జవాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ టీజర్ కూడా భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే ఇప్పుడు జవాన్ సినిమా చిక్కుల్లో పడినట్లు చెబుతున్నారు. జవాన్ కథ విషయంలో డైరెక్టర్ అట్లీపై ఓ నిర్మాత ఫిర్యాదు […]
సాధారణంగా అభిమాన సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి కొత్త వార్తలు వినిపించినా, ఎప్పుడూ చూడని ఫోటోలు కనిపించినా సర్ప్రైజ్ అయిపోతుంటారు అభిమానులు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేసేస్తుంటారు. గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేకపోవడంతో హీరోహీరోయిన్లకు సంబంధించి ఏ వార్తలైనా టీవీ న్యూస్ లేదా న్యూస్ పేపర్స్ ద్వారా తెలుసుకునేవారు. కానీ.. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎప్పుడో గతంలో ఫోటోషూట్స్ చేసి, […]
బాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరో షారూఖ్ ఖాన్. కేవలం నటుడిగానే కాకుండా యాంకర్ గా తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల షారూఖ్ నటించిన చిత్రాలు పెద్దగా ఆకర్షించకపోయినా.. ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీఖాన్. వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉంది. ఇటీవల షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం సంచలనం సృష్టించింది. షారూఖ్ ఖాన్ కూతురు సుహానా […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయకుడి నామస్మరణ మారుమోగుతోంది. భక్తిశ్రద్ధలతో వివిధ రూపాల్లో విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. వీధి వీధినా.. వాడవాడలా గణేష్ మండపాలు వేలిశాయి. వినాయక చవితితో దేశమొత్తం ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించి మతసామరస్యాన్ని ఘనంగా చాటారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా గణేష్ ప్రతిమను ప్రతిష్టించి.. పూజలు జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోను షారుఖ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తూ.. ‘గణపతిజీ.. […]
షారుక్ ఖాన్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్‌లో బాద్ షాగా ఎదిగాడు. భారతీయ సినిమాలో కింగ్ అని బిరుదు అందుకున్నాడు. షారుక్ ఖాన్ ఎంతో సింపుల్‌గా ఉండే వ్యక్తి అని అందరికీ తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారిలో షారుక్ ఖాన్ కూడా ఒకడు. ఫ్యాన్స్ విషయంలో షారుక్ ఖాన్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంటాడు. ఒక బాద్‌షాగా ఎదిగిన వ్యక్తి ఇంత సింపుల్‌గా ఉంటాడా అంటూ అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. కెరీర్‌లో ఎన్నో రికార్డులు నమోదు […]