జవాన్ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో నటిస్తున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఒకరు కోలీవుడ్ హీరో అయితే, మరొకరు టాలీవుడ్ స్టార్ హీరో అని ఫ్యాన్స్ ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఆ స్టార్ ఎవరు?
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం జవాన్. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని మూడు భాషల్లో విడుదల చేశారు. హిందీ టీజర్ విడుదలైన మూడు గంటల్లో 5.1 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. తమిళంలో 1.2 మిలియన్ వ్యూస్ తెచ్చుకోగా.. తెలుగులో 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. టీజర్ మాత్రం యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కిరాక్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దుమ్ము లేచిపోయింది. ఈ సినిమాని 2023 సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి నటిస్తున్నారు. దీపికా పదుకొనే అతిథి పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తున్నారు. ఈ టీజర్ లో కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ఉన్నారంటూ కోలీవుడ్ విజయ్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. టీజర్ లోని 35 సెకన్ల దగ్గర ఫైట్ సీన్ లో కనబడుతున్న పాత్ర విజయ్ దేనని అంటున్నారు. మరోవైపు తెలుగు ప్రేక్షకులు అక్కడ ఉన్నది అల్లు అర్జున్ అని అంటున్నారు. ఆ హెయిర్ స్టైల్ చూస్తే అల్లు అర్జున్ లానే కనిపిస్తున్నారని బన్ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో దర్శకుడు అట్లీ ఈ సినిమాలో అతిథి పాత్ర కోసం అల్లు అర్జున్ ని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఆ మధ్య బన్ని కూడా ముంబైలో సందడి చేశారు. దీంతో జవాన్ షూటింగ్ లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. మరి జవాన్ లో అల్లు అర్జున్ ఉన్నారా? లేక విజయ్ ఉన్నారా? తమిళ్ వెర్షన్ లో విజయ్, తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్నారా? అసలు టీజర్ లో కనిపించిన ఆ హీరో ఎవరు? అనేది ఇప్పుడు పెద్ద స్పస్పెన్స్ గా మారింది. మరి టీజర్ లో 35 సెకన్లు దగ్గర కనిపిస్తున్న హీరో ఎవరో గెస్ చేయండి.