Actress Ravali: ఎంతటి వారికైనా ఒక ఏజు, ఒక స్టేజు వచ్చాక ఫిజిక్ ను మెయిన్ టెయిన్ చేయడం కష్టమే. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారికి మరీ కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారైనా.. అవకాశాలు, అవసరం లేకపోతే ఫిజిక్ ని ఎందుకు మెయిన్ టెయిన్ చేస్తారు చెప్పండి? ఆరోగ్యం గురించి ఆలోచించేవారైతే జిమ్ లో ఎక్సర్సైజులు, ఇంట్లో వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటారు. ఇక పూర్తిగా కుటుంబానికే తమ జీవితాన్ని అంకితం చేసిన వారికి.. ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవళికి కూడా ఇది పెద్ద టాస్క్ లా కనబడినట్టు ఉంది. అందుకే ఆమె గుర్తుపట్టని విధంగా తయారయ్యారు.
రవళి నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. మంత్రి రోజాతో కలిసి ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రోజాతో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫోటోల్లో రవళి గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. రవళిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు నెటిజన్లు.
టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోలతో కలిసి నటించిన రవళి.. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం రవళి ఇంటి దగ్గరే ఉంటున్నారు. గత ఏడాది రాఘవేంద్ర రావు ‘పెళ్లిసందD’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన రవళి.. తనను ఎవరూ గుర్తుపట్టడం లేదని చెప్పారు. తన పేరు రవళి అంటూ పరిచయం చేసుకున్నారు. బాగా బరువు పెరగడం వల్లనే తనను గుర్తు పట్టలేకపోతున్నారేమో అంటూ తన మీద తనే సెటైర్ వేసుకున్నారు.
ఇది కూడా చదవండి: మగ బిడ్డ కోసం పూజలు! ఆ కోరిక తీరిందని మరో బిడ్డని బలి ఇచ్చాడు!
ఇది కూడా చదవండి: Kiraak RP: షేకింగ్ శేషు భార్య, కూతురు మీద ఆర్పీ దారుణ వ్యాఖ్యలు!