ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి తిరుపతి. ఎప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి నమో వెంకటేశాయ నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. నిత్యం శ్రీవారి భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. పర్యాటకుల రాకపోకలతో తిరుపతి వీధులన్నీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి తిరుపతి. ఎప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి నమో వెంకటేశాయ నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. నిత్యం శ్రీవారి భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. పర్యాటకుల రాకపోకలతో తిరుపతి వీధులన్నీ కళకళలాడుతుంటాయి. అటువంటి తిరుమల ఇటీవల కాలంలో చిరుతపులి దాడలు కలకలంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. కాలినడక మార్గం కూడా వెంకటేశ్వరుని దర్శనం చేసుకునేందుకు వస్తున్న చిన్నారులపై చిరుత దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. రెండు నెలల క్రితం ఓ చిన్నారిపై దాడి చేస్తే బయట పడిన సంగతి తెలిసిందే. తాజాగా లక్షిత అనే చిన్నారి బలయ్యింది. ఈ వార్తలు ఇంకా మర్చిపోక ముందు.. మరోసారి తిరుపతి వార్తల్లో నిలుస్తోంది.
అదేంటంటే ఓ వ్యక్తి తిరుమలతో గొంతు కోసుకోవడం కలవరపాటుకు గురి చేసింది. స్థానిక రింగు రోడ్డు వద్ద ఓ వ్యక్తి రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని గమనించిన భక్తులు వెంటనే 108కి సమాచారం అందించారు. తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని సమీపంలోని అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గొంతు కోసుకున్న వ్యక్తిని కరీంనగర్‌కు చెందిన తులసీరామ్‌గా గుర్తించారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. మద్యానికి బానిసై ఇలా చేసుకున్నానని ఓసారి.. కుటుంబ కలహాలు కారణంగానే ఇలా చేసుకున్నట్లు మరోసారి అతడు సమాధానం ఇచ్చాడు బాధితుడు. మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.