సూపర్ స్టార్ మహేశ్ కు తమిళ్, మలయాళం, కన్నడలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మహేశ్ సినిమాలు దక్షిణాదిలో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. మహేశ్ బాబు ‘బర్త్ డే’ సందర్భంగా ‘కస్తూరీ శంకర్’ ట్వీట్ వేశారు. కస్తూరి ‘గృహలక్ష్మీ’ సిరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే వివాదాలకు కేరాఫ్‌గా మారిన కస్తూరీ శంకర్ మహేశ్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన ట్వీట్‌తో నెట్టింట్లో రచ్చ మొదలైంది.
ఆమె చేసే రాజకీయ విశ్లేషణలు ఎక్కువగా కాంట్రవర్సీకి దారి తీస్తుంటారు. ఆమె వేసే పోస్ట్‌లు, చేసే ట్వీట్లు, మాట్లాడే మాటలు ఎప్పుడూ కూడా వివాదాలకు దారి తీస్తుంటాయి. మహేశ్ బాబుకు విషెస్ చెప్పబోయి దళపతి విజయ్‌ను కించపరిచేశారు. ఇందులో కించపరిచినట్టు డబుల్ మీనింగ్‌లానే అనిపిస్తుంది. దీంతో దళపతి అభిమానులు తెగ హర్ట్ అవుతున్నారు. కస్తూరీ శంకర్‌ను ఆడుకుంటున్నారు.
‘తమిళనాడు లో కూడా మహేశ్ బాబును ఇష్టపడుతారు. ఆయన అన్ని సినిమాలను విజయ్ ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. తమిళ అభిమానులు ఆ ఒరిజినల్ చిత్రాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్లో విజయ్‌ను ప్రస్థావించడం, అది కూడా రీమేక్ స్టార్ గా ప్రొజెక్ట్ చేయడంపై దళపతి అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మహేశ్ బాబు చేసిన పోకిరి, ఒక్కడు సినిమాలను మాత్రమే విజయ్ రీమేక్ చేశారు… కళ్లు ఏమైనా పోయాయా? ఆ మాత్రం తెలియదా? ఉద్దేశ్యం ఏంటి? విజయ్‌ను రీమేక్ స్టార్ అని చెప్పడమా? అంటూ రకరకాలుగా కస్తూరీ శంకర్ మీద కామెంట్లు చేస్తున్నారు.
కస్తూరి శంకర్ ట్వీట్ ఇక్కడ చూడండి:
Happy Birthday to the always svelte MaheshBabu.
Mahesh Babu is loved in TamilNadu too, all his movies have been remade with our Vijay, Tamil fans watch and enjoy the original too ! #HBDMaheshBabu @urstrulyMahesh pic.twitter.com/MWKRALR8wg— Kasturi Shankar (@KasthuriShankar) August 9, 2021