సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ మాత్రమే కాదు.. సీరియల్స్ లో సాంప్రదాయబద్దంగా కనిపించే లేడీ ఆర్టిస్టులు సైతం అందాల ప్రదర్శనలో పోటీ పడుతున్నారు. ఫామ్ లో ఉన్న హీరోయిన్ గ్లామర్ షో చేసిందంటే ఓకే అనుకుంటారు ప్రేక్షకులు ఫ్యాన్స్. 50 ఏళ్ళు దగ్గరపడిన సీనియర్ నటి ఊహించని రేంజిలో గ్లామర్ షో చేస్తే.. ఖచ్చితంగా షాక్ కి గురవుతారు ఫ్యాన్స్, నెటిజన్లు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే అందాల షోతో రచ్చ చేస్తోంది నటి కస్తూరి.
ప్రస్తుతం పాపులర్ తెలుగు సీరియల్ గృహలక్ష్మిలో మెయిన్ రోల్ చేస్తోంది. కస్తూరికి సోషల్ మీడియా కాంట్రవర్సీలు కొత్త కాదు. ఆమెకు ఏదనిపిస్తే అది ముక్కుసూటిగా పోస్ట్ చేసి చెప్పేస్తుంది. అయితే.. సీరియల్ లో చీరకట్టుకొని తెలుగింటి గృహలక్ష్మిలా అంటే.. ఇలాగె ఉండాలని అనిపించుకున్న కస్తూరి.. సోషల్ మీడియాలో చూస్తే మాత్రం చీరకట్టు తప్ప అన్ని ట్రెండ్ కి తగ్గ డ్రెస్సింగ్ స్టైల్, స్కిన్ షో.. టాప్ టు బాటమ్ కెమెరా ముందుంచుతుంది.
తాజాగా కస్తూరి పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. గృహలక్ష్మిగా కస్తూరిని అభిమానించే వారందరూ ఈ కొత్త వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే.. బ్లూ డ్రెస్ లో కస్తూరి చేసిన రచ్చ వర్ణించడానికి కూడా వీలు లేకుండా ఉంది. మరి ఇంత దారుణంగా ఎలా వీడియోలు చేస్తోందంటూ కొందరు కామెంట్స్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఈమె ఇంకా పదహారేళ్ళ అమ్మాయే అనుకుంటుందా అంటూ నెటిజన్లు భావిస్తున్నారు. మరి కస్తూరి లేటెస్ట్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.