అది కూడా శ్రియ వేసుకున్న డ్రెస్‌పై కస్తూరి వ్యంగ్యంగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రియ ఓ కొత్త స్టైల్ డ్రెస్‌ను వేసుకుని ఫొటో షూట్ చేశారు. తర్వాత ఆ ఫొటోలను..
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘కస్తూరి శంకర్’. వెండి తెరతో పాటు బుల్లి తెరపై కూడా ఈమె చాలా ఫేమస్. కేవలం నటన పరంగానే కాదు.. కాంట్రవర్సీల విషయంలోనూ కస్తూరి చాలా ఫేమస్. తరచుగా సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. ఏదో ఒక విషయంపై తనదైన స్టైల్లో స్పందిస్తూ గొడవలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా, కస్తూరి ప్రముఖ హీరోయిన్ శ్రియ శరణ్‌పై కామెంట్లు చేశారు.
అది కూడా శ్రియ వేసుకున్న డ్రెస్‌పై కస్తూరి వ్యంగ్యంగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రియ ఓ కొత్త స్టైల్ డ్రెస్‌ను వేసుకుని ఫొటో షూట్ చేశారు. తర్వాత ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారాయి. ఇక, ఆ ఫొటోలపై నటి కస్తూరి స్పందించారు. ‘‘ నోనోనో.. స్టైయిల్ ఫెయిల్’’ అంటూ కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ కాస్తా కొంతమంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆమె అలా శ్రియ డ్రెస్‌పై కామెంట్ చేయటాన్ని వారు తప్పుబడుతున్నారు.
గతంలో కస్తూరి మోడ్రన్ డ్రెస్‌లు, బికినీలు వేసుకుని దిగిన వీడియోలు, ఫొటోలను తెరపైకి తెస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఒక మహిళవు అయి ఉండి.. మరో మహిళను హేళన చేస్తావా అంటూ మండిపడుతున్నారు. ఒక వేలు నువ్వు వేరే వారి వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు నీ వైపు చూపిస్తాయంటూ మండిపడుతున్నారు. మరి, శ్రియ డ్రెస్‌పై కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డ నటి కస్తూరి శంకర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.