బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రౌనత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతుంటారు. అది ఇండస్ట్రీ అయినా.. ఏ ఇతరం అంశమైనా తనదైన శైలిలో స్పదిస్తుంటారు. ఇప్పుడు దేశమంతా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నీటి కుండంలో శివలింగం బయట పడడంతో ఈ రగడ మొదలైంది. అక్కడ ఎప్పటి నుంచో హిందూ మహిళలు పూజలు చేసేవారని హిందువులు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కంగనా తనదైన స్టైల్లో స్పందించారు. తాజగా కంగనా రనౌత్ ‘ధాకడ్’ అనే సినిమాలో నటించిన తెలిసిందే.
ధాకడ్ మూవీ రిలీజ్ కి ముందు చిత్ర యూనిట్ కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది. కంగనాతో పాటు చిత్ర యూనిట్ గంగా హారతి ఇచ్చారు.. తర్వాత కాశీ విశ్వనాథ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బయటకు వచ్చిన చిత్ర యూనిట్ తో మీడియా ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నీటి కుండంలో శివలింగం బయట పడడం విషయంపై కంగనా మాట్లాడారు. కాశీలో ఎక్కడ చూసినా ఆ మహాదేవుడే కనిపిస్తాడు.. ఓంకార నాథం వినిపిస్తుంది అన్నారు.
ఇక మధురలో ప్రతిచోట శ్రీకృష్ణుడు కొలువై ఉన్నారు. అలాగే, అయోధ్యలోని ప్రతి భాగంలోనూ రాముడు ఉంటాడని చెప్పుకొచ్చారు. కంగనా వెంట అర్జున్ రామ్ పాల్, దివ్యాదత్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు జ్ఞానవాపి మసీదుపై స్పందించాలంటూ ఆమెను కోరడంతో తనదైన స్టైల్లో జవాబు ఇచ్చారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“There’s Lord Krishna in every particle of #Mathura & Lord Ram in every particle of #Ayodhya. Similarly, there’s Lord Shiva in every particle of #Kashi. He doesn’t need a structure, he resides in every particle,” #KanganaRanaut when asked about #Shivling claim site at #Gyanvapi pic.twitter.com/oXl5yTptJI
— The Times Of India (@timesofindia) May 19, 2022