కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. తన తోటి హీరోయిన్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఫలానా హీరోయిన్స్ నిర్మాతలకు అన్ని విధాలుగా కమిట్ అవుతారంటూ కంగనా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ హీరోయిన్లలో కంగనా రనౌత్ కాస్త వైవిధ్యమనే చెప్పాలి. కెరీర్ మొదట్లో హీరోల సరసన నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్న కంగన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కు షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలో ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాలకు కలెక్షన్లతో పాటు అవార్డులు కూడా వరించాయి. ఆ తర్వాత మాత్రం కంగన చేసిన చిత్రాలు అంతగా ఆడలేదు. అయితే హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్లో దూసుకెళ్తున్నారామె. కథతో పాటు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆమె మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అంటుంటారు. వైవిధ్యమైన చిత్రాల్లో నటించేందుకు మక్కువ చూపే కంగన.. ఈమధ్య సినిమాల కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా కంగనా రనౌత్ కొందరు హీరోయిన్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా కంగన మాట్లాడుతూ.. చాలా మంది ఏ-లిస్టు హీరోయిన్స్ ఉచితంగా యాక్ట్ చేస్తారని.. వారికి ఇతర మార్గాల్లో దర్శకనిర్మాతలు ఫేవర్ చేస్తారన్నారు. స్టార్ మేకర్స్‌తో అందివచ్చిన అవకాశాన్ని, మంచి పాత్రలను దక్కించుకోకపోతే తమకు నష్టం జరుగుతుందని వారు భావిస్తారని కంగన చెప్పుకొచ్చారు. అందుకే ఆ హీరోయిన్లు మేకర్స్‌తో అన్ని విధాలుగా కమిట్ అవుతారని.. రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా పని చేస్తారని కంగన పేర్కొన్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో పారితోషికంలో ఉండే వ్యత్యాసం పైనా కంగన స్పందించారు. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్స్ ఉచితంగా పనిచేస్తున్నారని తెలిపారు.
‘బాలీవుడ్లో ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లు ఉచితంగా పనిచేస్తున్నారు. అయితే నేను మాత్రం అలా చేయడం లేదు. హీరోలకు దీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ను నేను మాత్రమే. ఇండస్ట్రీలో గతంలో పితృస్వామ్య నిబంధనలకు అనుగుణంగా స్త్రీల ధోరణి ఉండేది. కానీ సమాన వేతనం కోసం నేను వాదించా. తద్వారా చాలా మందికి మార్గదర్శకురాలిగా మారా. కొన్ని క్యారెక్టర్స్ కోసం మేకర్స్‌తో చర్చించే సమయంలో నా సమకాలీన హీరోయిన్లు ఫ్రీగా పనిచేయడానికి ముందుకొచ్చారు. స్టార్ మేకర్స్ సరసన ఎక్కడ ఛాన్స్ కోల్పోతామనే భయంతో ఇతర మార్గాల్లో వారిని ఆశ్రయించారు’ అని కంగన స్పష్టం చేశారు. మరి.. తన తోటి హీరోయిన్లపై కంగన చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.