చిత్రపరిశ్రమలో వందల సినిమాలు చేసిన నటీనటులు వయసు పైబడ్డాక సినిమాలకు దూరమవుతుంటారు. సరే సినిమాలంటే చేయట్లేదు. కనీసం ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా? అనేది అసలు పాయింట్. ఇటీవల కాలంలో సీనియర్స్ నటీనటులంతా ఒక్కొక్కరుగా అనారోగ్యం బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరోని చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. హీరోగా వందల సినిమాలు చేసిన ఆయన్ని.. ఒక్కసారిగా వీల్ చైర్ లో చూసేసరికి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అంటే.. కెప్టెన్ విజయకాంత్. ఎక్కువగా పోలీస్ స్టోరీస్ తో సినిమాలు చేసిన విజయకాంత్ గురించి సౌత్ ఇండియన్ ఆడియెన్స్ కి పరిచయం అక్కర్లేదు.
కెరీర్ మొత్తం కేవలం తమిళ భాషలోనే సినిమాలు చేసిన నటులలో విజయకాంత్ ఒకరు. కాగా.. 1979లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయకాంత్.. దాదాపు మూడు దశాబ్దాలపాటు నటుడిగా స్టార్డమ్ ని చూశారు. ఓవైపు సినిమాలు చేస్తూనే ‘డిఎండికే’ పార్టీ స్థాపించి రాజకీయాలలోకి ప్రవేశించారు. ఇక 2006, 2011లలో ఎమ్మెల్యేగా గెలిచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా రాణించారు. ఎక్కువగా రెవల్యూషనరీ మూవీస్ చేసిన విజయకాంత్.. తన 100వ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ మూవీతో ‘కెప్టెన్’ బిరుదుతో ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఈయన సినిమాలు తెలుగుతో పాటు హిందీలోకి కూడా డబ్ అవుతూ వచ్చాయి.
ఇదిలా ఉండగా.. విజయకాంత్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్ళు.. కాగా, కొన్నేళ్ల నుండి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారట. ఆ కారణంగానే గతేడాది వైద్యులు ఆయన కాలికి మూడు వేళ్లను తొలగించారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ 33వ వివాహ వార్షికోత్సవం నిర్వహించారు కుటుంబ సభ్యులు. 1990లో జనవరి 31న ప్రేమలతను పెళ్లాడారు విజయకాంత్. ఈ సందర్భంగా దంపతులిద్దరినీ పూలమాలలతో సత్కరించారు కుటుంబీకులు. అందుకు సంబంధించి ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫోటోలో విజయకాంత్ ని చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ‘సాలిడ్ పర్సనాలిటీ కలిగిన మా కెప్టెన్ ఏంటి ఇలా అయిపోయారు?’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రెజెంట్ వీల్ చైర్ లో విజయకాంత్ మాస్క్ ధరించి, బాగా చిక్కిపోయి కనిపిస్తున్నారు. మరి ఆయన త్వరగా కోలుకొని నార్మల్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. నటుడు విజయకాంత్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Happy 33rd wedding anniversary Dear Captain @iVijayakant and #premalathavijayakanth #Vijayakanth #CaptainVijayakanth #PremalathaVijayakanth
#WeddingAnniversary pic.twitter.com/IcF2vEb4Qe— Sreedhar Pillai (@sri50) January 31, 2023
#SAChandrasekhar #Vijayakanth Recent Clicks 📸😍❤️ pic.twitter.com/dIuonEJPcB
— Trend Soon (@trend_soon) January 31, 2023
January 31st
Wishing Our Captain @iVijaykanth Sir And #Premalatha Madam,
A Very Happy 33 Wedding Anniversary.#Vijayakanth #CaptainVijayakanth #PremalathaVijayakanth #Premalatha #DMDK#WeddingAnniversary@lksudhish @MpAnand_PRO@idiamondbabu @esakkimuthuk @RIAZtheboss pic.twitter.com/e0Kuj65ni0— Actor Kayal Devaraj (@kayaldevaraj) January 30, 2023