Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాస్ యాక్షన్ మూవీ ‘సలార్‘ చేస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అటు డార్లింగ్ ఫ్యాన్స్ లో, ఇటు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సలార్ మూవీ గురించి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పలు క్రేజీ విషయాలు బయటపెట్టారు. సలార్ లో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు.
పృథ్వీరాజ్ మాట్లాడుతూ..”రెండేళ్ల క్రితమే ఓ క్యారెక్టర్ కోసం నన్ను సంప్రదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. నాకు సలార్ కథను వినిపించాడు. ప్రశాంత్ కథ వినిపించినప్పుడే నాకు బాగా నచ్చింది అప్పుడే ఓకే చెప్పాను. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో మళ్లీ నో చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా వల్ల అన్ని మారిపోయాయి. ప్రభాస్ డేట్లు కూడా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ను కలుస్తాను.
ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ నేరేట్ చేసేందుకు వచ్చినప్పుడు.. నేను నటుడిగా కంటే నాలోని దర్శకుడి కోణంలో నుండి విన్నాను. అంచనాలకు మించే స్థాయిలో సినిమా ఉంటుంది.. అద్భుతమైన స్క్రిప్ట్. ఇలాంటి సినిమాల్లోనే మనం ప్రభాస్ ను చూడాలనుకుంటాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ప్రభాస్. అతనితో నటించాలని నాకు ఉంది. అలాగే ప్రశాంత్ నీల్, హోంబేలె ఫిలిమ్స్ నిర్మాతలు నాకు మంచి స్నేహితులు” అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం పృథ్వీరాజ్ మాటలు సలార్ మూవీపై అంచనాలు రెట్టింపు చేసేలా ఉన్నాయి. అంతేగాక ప్రభాస్ కోసం సినిమా ఒప్పుకున్నానని, సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పేసరికి ఫ్యాన్స్ లో సంబరం మామూలుగా లేదు. ఇదిలా ఉండగా.. త్వరలోనే పృథ్వీరాజ్ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయనున్నట్లు చెప్పాడు. ఇక సలార్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సలార్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
The Biggest reason of all is that It’s a Kick-ass Script, When I Listen to the script of #Salaar you know it was more the Director in me thinking .. Ohh “I would Love to see #Prabhas in this”. ❤️ – @PrithviOfficial pic.twitter.com/luEOzf5Ufp
— . (@charanvicky_) June 27, 2022