Balakrishna: నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. నందమూరి సీనియర్ ఎన్టీఆర్ చిన్నకూతురు, హీరో బాలకృష్ణ సోదరి కంఠమనేని ఉమా మహేశ్వరి అకాల మరణంతో నందమూరి కుటుంబ సభ్యులలో, అభిమానులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఉమా మహేశ్వరి స్వగృహంలో ఆమె పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు నివాళి తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమా మహేశ్వరి అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.
ఇదిలా ఉండగా.. నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో వచ్చి సోదరి ఉమా మహేశ్వరి ఇంటివద్ద జరగాల్సిన కార్యక్రమాలు చూసుకుంటున్నారు. అయితే.. సోదరిని కోల్పోయిన బాధలో ఉన్న బాలకృష్ణతో ఓ అభిమాని ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ అభిమానిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ ని ఎంత ప్రేమగా పలకరిస్తారో తెలిసిందే. అలాగని సమయం సందర్భం బట్టి ప్రవర్తించకపోతే ఆగ్రహానికి గురవుతుంటారు.
ఇక సోదరి చనిపోయిన బాధలో ఉన్న బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని దగ్గరికి వచ్చి.. సెల్ఫీ అడిగాడు. దీంతో బాధలో ఉన్న బాలయ్య సదరు అభిమాని తెలివితక్కువ తనాన్ని గ్రహించి.. ఏమి అనకుండా పోనిలే అని వదిలేశాడు. ప్రస్తుతం బాలయ్య – అభిమాని మధ్య జరిగిన ఇన్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరి ఆ అభిమాని చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.