2023.. సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ ప్రేక్షకులలో మరింత సందడి నింపనుంది. ఈసారి టాలీవుడ్ లో తెలుగు హీరోలతో పాటు తమిళ హీరోలు సైతం పోటీ పడుతుండటం విశేషం. నటసింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’.. దళపతి విజయ్ ‘వారసుడు’.. హీరో అజిత్ నటించిన ‘తెగింపు’ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. మొత్తానికి ఫ్యాన్స్ కి పండగకి ఏయే సినిమాలు వస్తున్నాయనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. అందుకే పొంగల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ నాలుగు సినిమాలు వేటికవే ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి.
మరి బాక్సాఫీస్ వద్ద వీరసింహారెడ్డి(జనవరి 12), వీరయ్య(జనవరి 13), వారసుడు(జనవరి 11), తెగింపు(జనవరి 11)ల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో గానీ.. కలెక్షన్స్ మాత్రం మోత మోగిపోయేలా ఉన్నాయి. నాలుగు సినిమాలు మంచి విజయాలు సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. పైగా ఇప్పటివరకు సినిమాల నుండి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా ఆయా సినిమాలపై హైప్ భారీగా క్రియేట్ చేశాయి. వీరసింహారెడ్డి మూవీని గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. అలాగే వీరయ్యని డైరెక్టర్ రవీంద్ర, వారసుడు వంశీ పైడిపల్లి, తెగింపు సినిమాని హెచ్ వినోద్ కుమార్ రూపొందించారు. అయితే.. ఇక్కడ పొంగల్ వార్ హీరోలకే కాదు.. డైరెక్టర్స్, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా జరగబోతుందని అర్థమవుతోంది.
ఇక రిలీజ్ నాలుగు సినిమాలలో వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలకు తమన్ మ్యూజిక్ అందించాడు, వీరయ్యకి దేవిశ్రీ ప్రసాద్, తెగింపుకి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. అదే విధంగా హీరోయిన్స్ విషయానికి వస్తే.. తెలుగులో రెండు సినిమాలకు శృతిహాసన్ సోలో హీరోయిన్. ఒకవేళ వారసుడుని లైన్ లోకి తీసుకునే రష్మిక మందానకి, శృతికి మధ్య పోటీ జరగనుంది. కానీ.. ఓ రకంగా బాక్సాఫీస్ వద్ద హీరోయిన్స్ పరంగా పెద్దగా ఫైట్ అయితే ఉండకపోవచ్చు. వీరసింహారెడ్డి, వీరయ్య రెండింటిలో శృతినే కాబట్టి. ఇవన్నీ పక్కన పెడితే.. ఆల్రెడీ ఈ వీరసింహారెడ్డి, వీరయ్య, వారసుడు, తెగింపు సినిమాల నుండి ట్రైలర్స్ వచ్చేశాయి. మరి ట్రైలర్స్ చూశాక మీలో కలిగిన ఫీలింగ్ ఏంటి? సంక్రాంతికి ముందుగా ఏ సినిమాని చూడాలని అనుకుంటున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి.
Imagine if @KChiruTweets was chief guest to VeeraSimha Reddy Pre-release event & Nandamuri Balakrishna to Waltair Veerayya
Eye Feast!#WaltairVeerayya #VeeraSimhaReddy #Chiranjeevi #Balayya #NandamuriBalakrishna #RaviTeja #shrutihassan #MythriMovieMakers @MythriOfficial pic.twitter.com/Fb4vkldcDW
— Lakshman Sai KumaRRR Tumati (@LakshmanConects) January 7, 2023
Who has Biggest Mass Fanbase in Tamilnadu??
Let’s settle it 💥💥💥https://t.co/l4P00nQ435#Varisu #VarisuTrailer #Thunivu #Thalapathy #ThunivuFromJan11 #VarisuFromJan11🔄 #AJITH ♥️ #VIJAY pic.twitter.com/fxGC2L1yjH
— Indian Box Officeᵀᴹ (@Indian_BoxOffic) January 5, 2023