తమిళ స్టార్ నటుడు విజయ్. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి సుపరిచితమే. ఇప్పుడు తాజాగా వారసుడు అంటూ వచ్చిన ఆయన తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
ఇసయ దళపతి విజయ్ నటించిన వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రిలీజైన(జనవరి 11) దాదాపు నెల రోజులకే ఓటిటిలోకి వస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏ విషయం ఎందుకు బయటకొస్తుందో అస్సలు అర్థం కాదు. అది నిజమో కాదో తెలుసుకునేలోపు సోషల్ మీడియా అంతా కూడా పాకేస్తుంది. చాలామందికి అయితే అసలేం జరుగుతుందిరా బాబోయ్ అని జుత్తు పీకేసుకుంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ విషయంలో అలానే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. కొన్నిరోజుల ముందు విజయ్, తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వనున్నాడనే అనే వార్తలొచ్చాయి. ఇప్పుడు దానికి కొనసాగింపు అన్నట్లు విజయ్, హీరోయిన్ కీర్తి సురేశ్ తో లవ్ […]
ఒకప్పుడు హీరోల గురించి విమర్శించాలన్నా, ట్రోల్ చేయాలన్నా సరే అది ఇద్దరూ లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య మాటల వరకు మాత్రమే ఉండేది. ప్రస్తుతం టెక్నాలజీ కల్చర్ బాగా పెరిగిపోయింది కాబట్టి.. తమకు సినిమా గురించి ఏదనిపిస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మూవీ టీమ్ కు ఈ విషయం తెలిస్తే బాధపడతారు లాంటి విషయాల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ‘వారసుడు’ సినిమాను కొందరు ట్రోలర్స్.. సీరియల్ లో పోల్చారు. […]
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అనగానే చాలామంది చెప్పే పేరు దిల్ రాజు. దాదాపు 50 సినిమాలు తీసిన ఆయన.. ఇటీవల సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో వారసుడిని కన్నారు. అవును.. చాలా సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజు.. ఈ మధ్య కాలంలో వార్తల్లో తరచుగా కనిపిస్తున్నారు. అయితే అవన్నీ కూడా సినిమాలు, రిలీజ్ వివాదాలు వాటి గురించి. అయితే […]
ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కావడం లేటు.. థియేటర్లలో చూసేవారు కొందరైతే, మరికొందరు మాత్రం ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత బయటకు చెప్పుకోవట్లేదు గానీ దాదాపు ఇలానే ఆలోచిస్తున్నారనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చిరు, బాలయ్య సినిమాలతో సంతోష్ శోభన్ నటించిన మూవీ ఉంది. ఇక తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజయ్యాయి. అందులో అందరినీ ఎట్రాక్ట్ చేసింది […]
సాధారణంగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మనం ఎప్పటినుంచో కలవాలనుకునే మనిషి, చేయాలనుకునే పని జరిగినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ దీనికి అతీతం కాదు. ఇక సినిమా సెలబ్రిటీలు కూడా చాలా కంపోజ్డ్ గా ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం బరస్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. తమన్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. […]
నార్మల్ టైంలో సినిమాల రిలీజ్ అంటే ఓ మాదిరిగా ఉంటుంది. కానీ సంక్రాంతికి రిలీజ్ అంటే మాత్రం ఆయా చిత్రాలపై ఓ రకమైన ఎక్స్ పెక్టేషన్స్ కచ్చితంగా ఉంటాయి. అందుకే తెలుగులో కావొచ్చు, తమిళంలో కావొచ్చు స్టార్ హీరోలు.. తమ మూవీస్ ని ఈ పండక్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటారు. అలా ఈ ఏడాది తెలుగులో చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా వచ్చేస్తున్నారు. ఇక తమిళంలో అజిత్ ‘తునివు'(తెలుగులో తెగింపు) సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. […]
సంక్రాంతికి బాక్సాఫీస్ రెడీ అయిపోయింది. తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలుగా వారసుడు, తెగింపు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 11న వారిసు, తెగింపు రిలీజ్ అవుతుండగా.. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య రిలీజ్ కాబోతున్నాయి. కానీ.. నిన్నటివరకు వారిసు తెలుగు వెర్షన్ వారసుడు రిలీజ్ డేట్ పై సందిగ్ధత ఏర్పడింది. ఈ విషయంపై తాజాగా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. […]
సంక్రాంతి వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి గట్టిగానే ఉంటుంది. అందుకు తగ్గట్లే స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంటాయి. అయితే ఈసారి స్టార్ హీరోలు చిరు, బాలయ్య.. తమ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అయితే వీటితోపాటే విజయ్ ‘వారసుడు’ కూడా తెలుగులో విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో మొన్న మొన్నటి వరకు కాన్ఫిడెంట్ గా ఉన్న నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు కొత్త రిలీజ్ […]