ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. బాహుబలి, బాహుబలి 2, కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసి.. వందల కోట్లు కొల్లగొట్టాయి. దీంతో అదే బాటలో కథలపై కాన్ఫిడెన్స్ ఉన్నవారు, భారీ బడ్జెట్ సోర్స్ ఉన్న హీరోలు, దర్శకులు తమ సినిమాలను సైతం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 2022లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్, కార్తికేయ 2, కాంతార, బ్రహ్మాస్త్ర, విక్రాంత్ రోణ, మేజర్.. ఇలా సౌత్, నార్త్ అన్ని ఇండస్ట్రీల నుండి పాన్ ఇండియా హిట్స్ నమోదయ్యాయి.
ఇప్పుడు 2023లో బాక్సాఫీస్ పై దాడి చేసేందుకు గతేడాదికి రెట్టింపు సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు ముస్తాబు అవుతున్నాయి. ఆల్రెడీ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోలతో పాటు యంగ్ హీరోలు సైతం బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బాలీవుడ్ నుండి తక్కువ సినిమాలు రెడీ అవుతున్నప్పటికీ, సౌత్ లో మాత్రం చాలా సినిమాలు బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. మరి ఫలితాలు ఎలా సాధిస్తాయో తెలియదు. కానీ.. ప్రతి నెలలో మినిమమ్ రెండేసి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ముందస్తుగా రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం విశేషం.