ఈ మధ్యకాలంలో మగాళ్లలో ఒత్తిళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆఫీస్ టెన్షన్, వర్క్ టెన్షన్లతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. తద్వారా ఇంట్లో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నారు. భార్యాభర్తల మధ్య శృంగార బంధం దారుణంగా దెబ్బతింటోంది. శృంగార అనుభవానికి ఎక్కువ కాలం దూరం అవ్వటం వల్ల మగాళ్ల ఆరోగ్యం మానసికంగా, శారీరకంగా దెబ్బ తింటోంది. పని ఒత్తిళ్ల కారణంగా మగాళ్లు ఇంటికి వచ్చి శృంగారానికి అంత ఆసక్తి చూపటం లేదు. భార్యలు కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. ఇదే తర్వాతి కాలంలో ఇబ్బందులు తెస్తోంది. ఇక, ఈ సమస్యకు ప్రముఖ డాక్టర్ పద్మ కమలాకర్ చక్కటి పరిష్కారం చెప్పారు. ఆమె మాట్లాడుతూ..
‘‘ శృంగారాన్ని పల్లెటూరిలోని వాళ్లే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. శృంగారం చేయటం ద్వారా మగాళ్లకు 267 కిలో క్యాలరీలు తగ్గుతాయి. ఆడవారికి అయితే 216 కిలో క్యాలరీలు తగ్గుతాయి. ఒత్తిడి అనేది చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి.. ఆలోచనా విధానాన్ని బట్టి రావటం, పోవటం జరుగుతూ ఉంటుంది. కామన్‌గా ఒత్తిడి ఉంటే పర్లేదు. కానీ, అది హైరేంజ్‌కు వెళ్లకూడదు. మగాళ్లకు వర్క్ విషయంలో చాలా ప్రెసర్ ఉంటుంది. ఆ ప్రెసర్ ఉన్నపుడు మగాడు ఇంటికి వస్తాడు. ఎందుకొచ్చిన గొడవ అని చెప్పేసి పడుకుంటాడు.
కానీ, అప్పుడు భార్యతో బాగా ఉండగలిగినపుడు ఉదయాన్నే మరింత హ్యాపీగా నిద్ర లేవగలుగుతాడు. హ్యాపీగా పని చేసుకోగలుగుతాడు. చాలా మంది దీన్ని మర్చిపోతూ ఉన్నారు. నా దగ్గరికి వచ్చిన చాలా మంది ‘‘ఎందుకులెండి మేడమ్ అలిసిపోయి వచ్చాం కదా.. పడుకుంటే సరిపోతుంది’’ అని అన్నారు. పడుకోవచ్చు. కానీ, ఆ ఒత్తిడి అనేది తలలో అలా తిరుగుతూనే ఉంటుంది. అదే భార్యతో సరదాగా ఉన్నాడనుకోండి, సరదాగా పని చేసుకోగలుగుతాడు. ఇది చాలా మంది మర్చిపోతున్నారు. మగాడికి ఎప్పుడు, ఏ టైంలో కోరిక కలుగుతుందో చెప్పలేం.
ఆ టైంలో అతడు కోరిక తీర్చుకోలేకపోతే ఒత్తిడి పెరిగిపోతుంది. అది భార్యకు ఇబ్బంది కాదు. కొంతమంది మగాళ్లు మార్నింగ్ ఇంట్రస్ట్ చూపిస్తారు. కొంతమంది నైట్. భార్యాభర్తలు ఇద్దరూ ఎంజాయ్ చేయటంలో ఏం తప్పులేదు. ఇందుకు ఎలాంటి సమయం ఉండదు. మనం హ్యాపీగా ఉండాలి. కోర్కెలు ఉన్నపుడు భార్యాభర్తలు ఎంజాయ్ చేయోచ్చు. ఇంట్లో, ట్రైన్లో, బస్సులో ఎక్కడైనా ఎంజాయ్ చేయోచ్చు. బెడ్రూం, కిచెన్ ఇలా ఇంట్లో ఎక్కడైనా ఎంజాయ్ చేయోచ్చు. ఇష్టం వచ్చినపుడు ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు’’ అని తెలిపారు.