వాలెంటైన్స్ డేకి ఏడు రోజుల ముందు నుంచే ప్రేమికుల రోజు సంబరాలు మొదలవుతాయి. ఆ ఏడు రోజుల్లోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఫిబ్రవరి 11ను ప్రామిస్ డేగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు జరుపుకుంటారు..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న వాలెంటైన్స్ డేకు మూడు రోజులు మాత్రమే ఉంది. ఇందుకు ఓ ఏడు రోజుల ముందు నుంచే సంబరాలు మొదలయ్యాయి. ప్రేమికులు ఒక్కో రోజును ఒక్కో విధంగా సెలెబ్రేట్ చేస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రేమికుల పండుగ మొదలైంది. ఇక, ఈ రోజు ప్రామిస్ డే. అంటే ప్రేమికులు ఒకరికి ఒకరు ప్రామిస్‌లు చేసుకునే రోజన్న మాట. వాలెంటైన్స్ వీక్‌లో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే.. భవిష్యత్తులో ఇద్దరి మధ్యా బంధాన్ని నిలపటానికి చేసుకున్న ప్రామిస్ కీలక పాత్ర పోషిస్తాయి. వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తిని తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు.
ఎదుటి వ్యక్తికి ప్రామిస్ చేయటం అంటే.. వారి ప్రేమకు విలువ ఇవ్వటం వంటిది. అది ఎదుటి వ్యక్తిలో ధైర్యాన్ని నింపుతుంది. ఈ ప్రామిస్ ఏ విషయంలోనైనా చేయోచ్చు. ఆ ఇచ్చే ప్రామిస్ ఎదుటి వ్యక్తిలో నమ్మకాన్ని నింపేదిలా ఉండాలి. ప్రామిస్ చేయటమే కాదు.. దాన్ని నిలుపుకోవటం కూడా ప్రేమలో భాగమే. ప్రామిస్‌ను కేవలం మాటలతోనే కాదు.. చేతలతో రాతలతో కూడా చెప్పవచ్చు. ఏది చేసినా ఎదుటి వ్యక్తిని సంతోష పెట్టేదిలా ఉండాలి. అది కేవలం ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కాకూడదు. జీవితంలో ఎప్పటికీ అలాగే ఉండాలి.
ప్రామిస్ చేయండిలా..