స్పెర్మ్ డొనేషన్‌కు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెర్మ్ డొనేషన్‌పై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. స్పెర్మ్ డొనేషన్‌పై చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి..
ప్రతీ స్త్రీ తన జీవిత కాలంలో ఒక్కసారైనా మాతృత్వ భాగ్యాన్ని పొందాలని భావిస్తుంది. పెళ్లి తర్వాత భర్త సాంగత్యంతో తల్లిగా ఓ పరిపూర్ణతను పొందుతుంది. అయితే, మగవారిలో వ్యంధత్వం ఇతర సమస్యల కారణంగా పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఉండొచ్చు.. అసలు లేకుండానే పోవచ్చు. అలాంటి సమయంలో సదరు మగవారి భాగస్వాముల్లో తల్లి కాలేమన్న బాధ మిగిలిపోతుంది. అయితే, వైద్య రంగం బాగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో మగవారి సమస్యల కారణంగా తల్లి అయ్యే భాగ్యానికి ఆడవాళ్లు దూరం కావాల్సిన అవసరం లేకుండా పోయింది. భార్యాభర్తల సమ్మతితో ‘సెర్మ్ డొనేషన్’ ద్వారా పిల్లలను కనడానికి వీలుంది.
స్పెర్మ్ డొనేషన్‌నే తెలుగులో వీర్య దానం అని అంటారు. స్మెర్మ్ డొనేషన్‌లో మగాళ్ల నుంచి హస్త ప్రయోగం ద్వారా వీర్యాన్ని సేకరిస్తారు. ఆ సేకరించిన వీర్యాన్ని అవసరమైన వారి కోసం ఉపయోగిస్తారు. ప్రత్యేక పద్దతుల ద్వారా స్త్రీ గర్భాశయంలోకి జొప్పిస్తారు. ఇక, ఎవరైతే తమ స్పెర్మ్‌ను డొనేట్ చేస్తారో వారినే స్పెర్మ్ డోనర్స్ అంటారు.
అనుమతి పొందిన అసిస్టెడ్ రీ ప్రొడెక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) బ్యాంకులు స్పెర్మ్ డొనేట్ చేయటానికి వచ్చే వారి శారీరక విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి. ఏఆర్‌టీ ప్రకారం.. 21 నుంచి 44 ఏళ్లు కలిగిన వారు స్పెర్మ్ డొనేషన్ చేయటానికి అర్హులు. కొన్ని స్పెర్మ్ బ్యాంకులు 18నుంచి 39 సంవత్సరాల వయసు వారినుంచి వీర్యాన్ని సేకరించి భద్రపరుస్తూ ఉంటాయి. స్పెర్మ్ డొనేషన్‌కు ముందు అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహిస్తాయి. వంశపారంపర్య రోగాలు, సర్జరీలు, అలర్జీలు, మద్యం, సిగరెట్ అలవాటు, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, హెచ్‌ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్ వంటి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాయి.
మెడికల్‌గా ఫిట్‌గా లేకపోతే వారినుంచి స్పెర్మ్‌ను సేకరించవు. అన్ని బాగా ఉన్నప్పటికి స్పెర్మ్‌లో సమస్యలు ఉంటే వాటిని నిలువ చేయవు. స్పెర్మ్ సేకరించిన తర్వాత ఓ మిల్లీ లీటర్ స్పెర్మ్‌లో 15 మిలియన్ల స్పెర్మ్ కౌంట్ ఉండాలి. స్పెర్మ్ సహజంగా, తగిన షేప్‌లో ఉండాలి. 40 శాతం కంటే ఎక్కువ మొటిలిటీని కలిగి ఉండాలి. అప్పుడే వాటిని నిల్వ చేస్తాయి. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోవచ్చు. అన్ని ఓకే అనుకున్నాక ఒప్పంద పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇతర భవిష్యత్తులో బయలాజికల్ పిల్లలతో సంబంధం కొనసాగించవచ్చో లేదో ముందుగానే తెలుసుకోవాలి.