‘‘కొత్త ఒక వింత పాత ఒక రోత’’ అన్న సామెత పెళ్లి విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే పెళ్లయిన కొత్తలో ఉన్నంత ఆకర్షణ కావచ్చు.. అనురాగం కావచ్చు.. రోజులు గడుస్తున్న కొద్దీ తగ్గుతూ పోతుంది. ముఖ్యంగా శృంగారం ద్వారా కలిగే అనుభవం పాత బడిపోతే కొంతమంది తమ భాగస్వాములపై అంత ఆసక్తి చూపించారు. ఇది ఎక్కువగా మొగవాళ్ల విషయంలో జరుగుతూ ఉంటుంది. ఇలా భర్తలు భార్యల మీద ఆసక్తి కోల్పోవటానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో శృంగారం అన్నది ప్రధానమైన అంశం. భార్యతో శృంగారం బోర్ కొట్టినా.. ఆమె శృంగారంలో అంతగా సహకరించకపోయినా భర్తకు విసుగు వస్తుంది. ఆ విసుగు ఎక్కువైతే ఆమెకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది కేవలం ఒక కారణం మాత్రమే మిగిలిన కారణాలు చాలా ఉన్నాయి. ఒక వేళ ఓ స్త్రీ తన భర్త తను చెప్పిన మాట వినేలా చేసుకోవాలనుకున్నా.. తమతో ప్రేమగా ఉండేలా చూసుకోవాలని భావించినా ఈ కింది విషయాలను తప్పక పాటించాలి.
భోజనం
మనిషికి భోజనం అన్నది నిత్యావసరం. కడుపునిండా.. రుచిగా భోజనం చేయాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. ముఖ్యంగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన వారు. ప్రతీ భర్త తన భార్య చేతి వంటను ఆస్వాదించాలని కోరుకుంటాడు. ఓ స్త్రీ ఎప్పుడైతే తిండి విషయంలో భర్తకు తల్లిని మరిపించేలా చేస్తుందో అప్పుడే భర్తలు సెరెండర్ అయిపోతారు. మంచి తిండి పెట్టే వారిని ఎవ్వరు మాత్రం కాదనుకుంటారు చెప్పండి.
శృంగారం
భార్యాభర్తల మధ్య బంధం అనేది శృంగారంతోనే బలంగా తయారవుతుంది. శృంగార జీవితంలో ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ భావప్రాప్తిని పొందుతారో.. వారి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యలు భర్తను తనవైపునకు తిప్పుకోవాలంటే శృంగారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అతడ్ని నొప్పించకుండా ప్రవర్తించాలి. అలాగని మీరు బాధపడకూడదు. తిండి తర్వాత మగాళ్లు లొంగేది శృంగారానికే.. కాబట్టి శృంగారం దగ్గరే భర్తను సొంతం చేసుకోవాలి.
ఎమోషనల్ సపోర్ట్
ప్రపంచంలో ప్రతీ మనిషికి ఏదో ఒక సందర్భంలో ఎమోషనల్ సపోర్టు అనేది అవసరం అవుతుంది. అయితే, పెళ్లి తర్వాత భార్య, భర్తకు.. భర్త భార్యకు ఎమోషనల్ సపోర్టుగా నిలవాల్సి ఉంటుంది. అంటే వారే వచ్చి నేను బాధలో ఉన్నానని చెప్పాల్సిన అవసరం లేదు. వారి బాధను అర్థం చేసుకుని మనమే ముందడుగు వేయాలి. ముఖ్యంగా మగాళ్ల విషయంలో భార్యలు తల్లుల్లా వ్యవహరించాలి. కొన్ని సార్లు తల్లులను మించిన పాత్ర పోషించాల్సి వస్తుంది.
వ్యక్తిగత పరిశుభ్రత
ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా సరిపోతుంది. కానీ, ఓ వ్యక్తితో జీవితాన్ని పంచుకుంటున్నపుడు వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. కొంతమంది స్త్రీలు అందంపై పెళ్లికి ముందు చూపించినంత ఆసక్తి పెళ్లి తర్వాత చూపించరు. పెళ్లయిపోయింది కదా.. మాకెందుకు అందంపై మక్కువ అనుకుంటారు. కానీ, అది తప్పు. భర్త తన భార్యను అందంగా చూడాలని అనుకుంటాడు. లేదా ఆఫీసునుంచి ఇంటికి వచ్చినపుడు అందంగా ముస్తాబై ఎదురు వచ్చిన భార్యను చూసి తన బాధలన్నీ మర్చిపోతాడు. ఎప్పుడైతే మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించారో.. కాస్త అయినా అందంగా కనిపించటానికి ప్రయత్నించరో అప్పుడే ఇద్దరీ మధ్యా దూరం పెరుగుతుంది.
ఇవే కాదు.. భార్య భర్త విషయంలో రొమాంటిక్‌గా ఉండాలి. అతడి మనసును అర్థం చేసుకుని ప్రవర్తించాలి. ఇంట్లో పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలి. అప్పుడే భర్తకు భార్యపై ఆసక్తి తగ్గకుండా ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి నిత్యం గొడవలు పడటం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఆచితూచి అడుగువేయాలి. భర్తలతో గొడవలు పడటం తగ్గించాలి. ఇవన్నీ చేసినా భర్తలో మార్పు రాకపోయినా.. మిమ్మల్ని అర్థంచేసుకోలేకపోయినా.. మీకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా.. కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లటం మంచిది.