ఆడ- మగ, భార్య- భర్త.. వీరి మధ్య ఉండే బంధం బలపడాలన్నా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లు కాలం గడపాలన్నా అందుకు చాలా ప్రయత్నాలు చేయాలి. ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేయాలి. ఒకరి అవసరాలు, కోరికలను మరొకరు తెలుసుకోవాలి. తమ జీవిత భాగస్వామిని ఆనందంగా ఉంచేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే పురుషుడు- స్త్రీని ఇంప్రెస్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అవి గిఫ్ట్‌లు ఇవ్వడం, ఆమెకు పనుల్లో సహాయం చేయడం వంటివి ఉంటాయి. అయితే ఇక్కడ పురుషుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. పడకగదిలో కూడా స్త్రీని ప్రసన్నం చేసుకోవాలి. నిజానికి పడకగదిలోనే ముందు స్త్రీని ఇంప్రెస్ చేయాలి. అక్కడ ఆమె మనసు దోచుకుంటే ఇంక మీకు ఢోకా ఉండదు.
అయితే ప్రతి మగాడు ఆ ఒక్క విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. పడకగది అంటే రెండే పనులకు ఉందని భావిస్తుంటారు. అయితే తన కోరికలు తీర్చుకోవడం, లేదంటే నిద్రపోవడం ఈ రెండింటి కోసం మాత్రమే బెడ్ రూమ్ ఉన్నట్లు భావిస్తూ ఉంటారు. అయితే పడక గది అనేది రోజు మొత్తంలో మీకు ఎదురైన అనుభవాలు, మీరు చేసిన పనులు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీరు తీసుకోబోయే నిర్ణయాల గురించి మీ భాగస్వామితో మనసువిప్పి మాట్లాడుకోవడానికి కూడా అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అంతేకాకుండా తినేసి పడకగదిలోకి వెళ్లిన తర్వాత మీ ప్రవర్తన కూడా స్త్రీకి నచ్చేలా ఉండాలి. తిన్నామా.. పని చేసుకున్నామా.. పడుకున్నామా.. ఇలా ఉంటే ఆడవాళ్లకు అస్సలు నచ్చదు.
ముఖ్యంగా మీరు చేసే శృంగారం విషయంలోనే మీ భాగస్వామికి ఎక్కువ సమస్యలు ఉంటాయని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. అదేదో యుద్ధంలా సమరశంఖం పూరించి.. వెంటనే నీరుగారిపోతే ఆడవాళ్లు అస్సలు ఇష్టపడరట. అంతేకాకుండా మీరు స్టార్ట్ చేసిన దగ్గరి నుంచి.. ఎండ బజర్ మోగే వరకు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించాలి. రతి అంటే ఒక్క ఫోర్ ప్లే మాత్రమే కాదని గుర్తుంచుకోవాలి. ముందుగా మీ భాగస్వామికి ఇంట్రస్ట్ ఉందోలేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆమెను మెల్లగా ప్రేరేపించాలి. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని బోలెడన్ని ఊసులు చెప్పాలి. కొన్నిసార్లు డర్టీ జోక్స్ కూడా ప్లే చేస్తూ ఉండాలి. మౌనంగా మీ పని మీరు చేసుకుని ముడుచుకుని పడుకుంటే మీ భాగస్వామికి, మీకు మధ్య గొడవలు జరగడం ఖాయం.
అలాగే మీకు అనిపించినప్పుడే కోరిక తీర్చుకోవాలి అనే ధోరణి మార్చుకోండి. ఒక్కోసారి మీ భాగస్వామికి కూడా కావాలి అనిపించవచ్చు. అలాంటి సమయంలో మీరు కాస్త ఓపిక చేసుకుని పూనుకోవాల్సి ఉంటుంది. అలా అయితే మీ బెడ్ రూమ్ జీవితం కాస్త చక్కగా సాగుతుంది. మీరు ఏవేవో వీడియోలు చూసేసి.. మీ భాగస్వామిపై ప్రయోగాలకు పూనుకోకండి. ముందుగా వాటి గురించి పార్టనర్‌తో మాట్లాడండి.. వారితో చర్చించి అర్థమయ్యేలా చెప్పండి. అందుకు వారు కూడా సుముఖంగా ఉంటేనే ట్రై చేయండి. కొసరుకు ఆశ పడి అసలుకు ఎసరు తెచ్చుకోకండి. అంతేకాకుండా ఎప్పుడూ ఒకేలా కానివ్వడం కూడా అంత ఇంట్రస్టెంట్‌గా ఉండదని చెబుతున్నారు. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితి, మీ భాగస్వామి పరిస్థితిని బట్టి కొత్తగా ట్రై చేయడం కూడా మీలో నూతన ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంటుంది.
ఇంక ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత.. బెడ్ రూమ్‌లోకి వెళ్లే గ్యాప్‌లో కూడా మీరు భాగస్వామితో జాగ్రత్తగా నడుచుకోవాలి. సినిమాల్లో చూపించినట్లు.. ఆఫీస్ నుంచి రాగానే బెడ్‌రూమ్‌లోకి పరుగులు పెట్టకండి. వచ్చీ రాగానే ఆ చెమట దుర్వాసన, కంపు కొట్టే సాక్సులు కూడా తీయకుండానే వారిని కార్యానికి ప్రేరేపించకండి. అలాంటి పనులు స్త్రీలకు అస్సలు నచ్చవు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి.. ఆమెకు డిన్నర్ ప్రిపేర్ చేయడంలో సహాయం చేయాలి. డిన్నర్ టైమ్ నుంచే వీలును బట్టి ఆమెతో నాటీగా మాట్లాడాలి. ఎంత త్వరగా తినేసి పడకగదికి వెళ్దామా అనిపించేలా ఆమెను రెచ్చగొట్టాలి. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది.. తనతో మాట్లాడేవాడు, తన కష్టాలను తెలుసుకునేవాడు, తన ఇష్టాలకు గౌరవం ఇచ్చేవాడు, తనను బాధపెట్టకుండా చూసుకునే వాడినే ఏ స్త్రీ అయినా ఇష్టపడుతుంది. కాబట్టి సుఖపెట్టడం అంటే కేవలం పడక సుఖం మాత్రమే అనే భ్రమ నుంచి బయటకు వచ్చి.. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని అందంగా మార్చుకోండి.